Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో సౌందర్య దీపతో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. దీపతో నువ్వు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకుంటుంది. కార్తీక్ ను కూడా సరిగా చూసుకోలేదని అంతా ఆ మోనిత వల్లే జరిగిందని అనడంతో దీప ఓదార్చి ధైర్యం చెబుతుంది. మోనిత ఇంట్లో ప్రియమణి సామాన్లన్నీ చిందరవందరగా వేయడంతో మోనిత వచ్చి ఇలా ఎందుకు చేశావని అడుగుతుంది. ఇదంతా మీకోసమే చేశానని మీపై ఇంత జరిగినా కూడా ఎందుకు కోపం చూపించడం లేదని రెచ్చగొడుతుంది.
ఎలాగైనా కార్తీక్ ను నా సొంతం చేసుకుంటాను అంటూ.. దీప పని ఎలాగైనా చేస్తానని ప్రియమణికి మాట ఇస్తుంది. ఇక సౌందర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే శ్రావ్య వచ్చి మాట్లాడుతుంది. సౌందర్య పట్టించుకోకుండా కార్తీక్ కోసం ఎదురు చూస్తుంది.
శ్రావ్య ఎంత మాట్లాడినా పట్టించుకోక పోయేసరికి ఎంతైనా పెద్ద కోడలు, పెద్ద కొడుకు, వాళ్ల పిల్లలు మాత్రమే కావాలని, మమ్మల్ని పట్టించుకోదని అనుకోవడంతో మొత్తానికి శ్రావ్యలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది.
కార్తీక్ హాస్పిటల్‌లో ఉండగా అక్కడికి ఓ పేషెంట్ తరపున అతడి భార్య, పిల్లలు వచ్చి కార్తీక్ తో ఎలాగైనా రక్షించమని కోరుకుంటారు. ఇక పిల్లలు కూడా మా నాన్నని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటారు. దాంతో కార్తీక్ వాళ్లకు ధైర్యం చెప్పి నేను చూసుకుంటాను అని మాట ఇస్తాడు.
ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ కు సిద్ధమవుతుండగా కార్తీక్ కు స్పృహ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. దాంతో అతని చేతులు వణుకుతూ ఉండగా డాక్టర్ రవి ఉండి బాగానే ఉన్నావు కదా కార్తీక్ అని ప్రశ్నిస్తాడు.
కానీ కార్తీక్ మాత్రం ఎలాగైనా అతడిని బతికించాలని ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి మరణించడంతో డాక్టర్ రవి వెంటనే కార్తీక్ తో అతడిని చంపేశావు అంటాడు. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…