గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Karthika Deepam : కార్తీక దీపం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. వంట‌ల‌క్క మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది..!

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండగలరు కానీ కార్తీకదీపం చూడకుండా అభిమానులు ఉండరు. అంత క్రేజ్ ని సంపాదించుకుంది ఈ సీరియల్. దీప, కార్తీక్ పాత్రలు ఈ…

Karthika Deepam : కార్తీక దీపం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. వంట‌ల‌క్క మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది..!

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం. ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండగలరు కానీ కార్తీకదీపం చూడకుండా అభిమానులు ఉండరు. అంత క్రేజ్ ని సంపాదించుకుంది ఈ సీరియల్. దీప, కార్తీక్ పాత్రలు ఈ సీరియల్ కు ఎంతో హైలెట్ గా నిలిచాయి.  వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్‌, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఐపీఎల్ మ్యాచ్, బిగ్ బాస్ షో లాంటివి కూడా ఈ సీరియల్ టీఆర్‌పీ రేటింగ్ ల‌ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. దాదాపుగా 1400 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుని ఇప్పటికీ నంబర్ వన్ సీరియల్ గా నిలిచింది కార్తీకదీపం. ప్రస్తుతం ఈ కథ వారి పిల్లలు శౌర్య, హిమ క్యారెక్టర్లతో స్టోరీ నడుస్తోంది. కానీ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత లేని కార్తీకదీపం కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ సీరియల్ లోకి వంటలక్క తిరిగి రాబోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో హల్ చల్ చేస్తోంది.

Karthika Deepam vantalakka is coming back on serial
Karthika Deepam

ఇంతకీ అసలు వివరాల్లోకి వెళితే.. ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా కార్తీకదీపం సీరియల్ కి సంబంధించిన గెటప్ తో వీడియో ఒకటి షేర్ చేసింది. ప్రేమి విశ్వనాథ్ ఈ వీడియోలో వంటలక్క గెటప్ వేసుకుంటూ రెడీ అవుతున్న సమయంలో దీప మేడమ్ షాట్‌ మేడమ్ అని వినిపించడంతో వస్తున్నా అంటూ చెప్పడం విశేషం.

ఇదే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో వీడియోతో పాటు వస్తున్నా.. మీకోసం.. అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. అంటే ఈ వీడియో ద్వారా వంటలక్క కార్తీక దీపం సీరియల్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కార్తీకదీపం అభిమానులకు దీప ఎంట్రీతో ఫుల్ జోష్ వచ్చినట్లే.  నెటిజన్లు సైతం ఆనందంతో లవ్ ఇమేజిస్ పెడుతూ విల్ యూ బ్యాక్ ఎగైన్.. వెయిటింగ్ అండ్ హ్యాపీ.. అంటూ, అదేవిధంగా డాక్టర్ బాబు కూడా వస్తున్నాడా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి