గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Vantalakka : వంట‌ల‌క్కకు కార్తీకదీపం సీరియ‌ల్ లో ఛాన్స్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Vantalakka : తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్. ఒకప్పుడు ఈ సీరియల్ స్టార్ హీరోల సినిమాలకు సైతం షాక్ ఇస్తూ.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. దీనికి కారణం వంటలక్క, డాక్టర్ బాబులు. ముఖ్యంగా వంటలక్క…

Vantalakka : వంట‌ల‌క్కకు కార్తీకదీపం సీరియ‌ల్ లో ఛాన్స్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Vantalakka : తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్. ఒకప్పుడు ఈ సీరియల్ స్టార్ హీరోల సినిమాలకు సైతం షాక్ ఇస్తూ.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. దీనికి కారణం వంటలక్క, డాక్టర్ బాబులు. ముఖ్యంగా వంటలక్క నటనకు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పట్టంగట్టారు. కేవ‌లం వంట‌ల‌క్క కోసమే ఈ సీరియ‌ల్స్ చూసే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వాస్త‌వానికి ఈ కార్తీక‌దీపం అనే సీరియ‌ల్ మ‌ళ‌యాళ‌ కరతముత్తు కు రీమేక్. అందులో వంట‌ల‌క్క‌గా న‌టించినామె న‌ట‌న న‌చ్చి తెలుగులో కూడా ఆ పాత్ర‌కు ఆమెనే సెలెక్ట్ చేశారు.

ఈ వంట‌ల‌క్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కేర‌ళ‌లోని ఎర్నాకులం ఎడ‌ప్ప‌ల్లిలో పుట్టిన ప్రేమి ఎల్ఎల్ బీ కంప్లీట్ చేసి కొంత‌కాలం పాటు లీగల్ అడ్వైజర్ గా చేసింది. ఫోటోగ్ర‌ఫీ మీద ఇంట్ర‌స్ట్ తో ఫోటోగ్ర‌ఫీ నేర్చుకొని కొన్ని పెళ్లిళ్ల‌కు త‌న టీమ్ తో పని చేసింది. త‌ర్వాత మోడ‌లింగ్ కూడా చేసింది. అలా మోడ‌లింగ్ చేస్తున్న‌ప్పుడే కరతముత్తు సీరియ‌ల్ లో ఛాన్స్ వచ్చింది. ఈ సీరియ‌ల్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ప్రేమీ పేరు మార్మోగింది. ముఖ్యంగా ఆ క‌ళ్ల‌తో ఆమె ప‌లికించిన హావాభావాల‌కు జ‌నాలు బాగా క‌నెక్ట్ అయ్యారు.

do you know how Vantalakka or premi viswanath got chance in kartheeka deepam serial
Vantalakka

అదే సీరియ‌ల్ ను తెలుగులో రీమేక్ చేసిన‌ప్పుడు ఆ పాత్ర‌కు ప్రేమీ అయితేనే న్యాయం చేయగలదని భావించి ఆమెనే కార్తీక‌దీపంలో వంట‌ల‌క్క‌గా తెలుగులో ప‌రిచ‌యం చేశారు. ఇక్కడ వంటలక్కకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మధ్య వంటలక్క క్యారెక్టర్ చనిపోతే రేటింగ్ కూడా అమాంతం పడిపోయింది. దీంతో చేసేది లేక సీరియల్ కు క్రేజ్ ను తీసుకుని రావడానికి సీరియల్ దర్శకుడు మళ్ళీ దీప, కార్తీలు బతికున్నట్టు చూపిస్తున్నారు. ప్రేమి భర్త వినీత్ భట్ ప్ర‌ముఖ జ్యోతిష్యుడు. ఈయ‌న‌ బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డును అందుకున్నాడు. ప్రేమిది ల‌వ్ మ్యారేజ్ కావ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి