Karthika Deepam : హిమ‌ను వ‌దిలి పెట్టేది లేద‌న్న శౌర్య‌.. పెళ్లి కూతురిగా హిమ ముస్తాబు..!

April 2, 2022 10:33 AM

Karthika Deepam : కార్తీక దీపం సీరియ‌ల్ రోజు రోజుకీ ఎంత‌గానో ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌లో త‌రువాత ఏం జ‌రుగుతుందా.. అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. ఇక ఈ రోజు (02-04-2022) ఎపిసోడ్ లో ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మోనిత ఇంటికి వెళ్లిన హిమ గ‌తాన్ని గుర్తు చేసుకుంటూ ఆనంద్ నా త‌మ్ముడే, వాడు నా ర‌క్త‌మే, అంద‌రూ క‌లిసి వాడిని నా నుండి దూరం చేశారు.. అని బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఇంత‌లో జ్వాల(శౌర్య‌) పెద్దాయ‌న‌ను బ‌స్తీలో దించేసి గ‌తాన్ని గుర్తు చేసుకుంటూ మోనిత ఇంటి వైపు వ‌స్తుంది. ఇంట్లో లైట్స్ వేసి ఉండ‌డాన్ని చూసి, ఇంట్లో ఎవ‌రో ఉన్నార‌ని అనుకుంటూ చూడ‌డానికి లోప‌లికి వ‌స్తుంది. కానీ అక్క‌డ హిమ ఉండ‌దు.

డాక్ట‌ర్ బాబు ఫోటో ముందు దీపం వెలిగించి ఉండ‌డాన్ని , డాక్ట‌ర్ బాబు, మోనిత క‌లిసి ఉన్న ఫోటోను చూసి షాక్ గురి అవుతుంది. మోనిత ఆంటీ డాడీని మోసం చేసింద‌ని, ఆనంద్ నాకు త‌మ్ముడే అవుతాడ‌ని అనుకుంటూ ఉంటుంది. ఆనంద్‌ను చిన్న‌ప్పుడే పంపించి మంచి ప‌ని చేశార‌ని, ఈ రోజు నుండి నాకు అక్క‌, త‌మ్ముల బంధం కూడా న‌చ్చ‌ద‌ని కోపంగా అంటుంది. ఇంట్లో లైట్స్ వేసి ఉండ‌డాన్ని గ‌మ‌నించి, ఇక్క‌డ ఎవ‌రు ఉన్నార‌ని గ‌ట్టిగా అరుస్తుంది. ఇంత‌లో ఒక పెద్దావిడ పై నుండి మెట్లు దిగి వ‌స్తుంది. ఎవ‌రు మీరు, ఇంట్లో ఎవ‌రెవ‌రు ఉంటార‌ని జ్వాల ఆ పెద్దావిడ‌ను అడుగుతుంది. ఇంట్లో ఎవ‌రూ ఉండ‌ర‌ని, అప్పుడ‌ప్పుడు నీ అంత వ‌య‌స్సు ఉన్న అమ్మాయి వ‌చ్చి, దీపం వెలిగించి, నాకు డ‌బ్బులు ఇచ్చి వెళ్లిపోతుంద‌ని ఆ పెద్దావిడ చెబుతుంది.

Karthika Deepam 02nd April 2022 full episode
Karthika Deepam

దీంతో జ్వాల.. హిమే వ‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటూ ఉండ‌గా, ఆ పెద్దావిడ ఇప్పుడే ఆ అమ్మాయి వ‌చ్చి వెళ్లింద‌మ్మా, వీధి కూడా దాటి ఉండ‌దు.. అని అన‌డంతో జ్వాల బ‌య‌ట‌కు ప‌రిగెడుతుంది. కానీ హిమ బ‌య‌ట క‌నిపించ‌దు, హిమ అని గ‌ట్టిగా అరుస్తూ, నిన్ను వ‌దిలేది లేదు అని అంటుంది. మ‌రుస‌టి రోజు డాక్ట‌ర్ బాబు అక్క కొడుకు ప్రేమ్‌ ను గుడికి వెళ్ల‌డానికి ఇంటికి పిలుస్తుంది. ప్రేమ్ గుడి వెళ్ల‌డానికే పిలిచావా, ఇంకా ఏదైనా ఉందా అని అడుగుతాడు. దీంతో ప్రేమ్ ను బ‌ల‌వంతంగా గుడికి తీసుకెళ్తుంది.

మ‌రో వైపు సౌంద‌ర్య.. హిమ‌కు పూలు పెడుతూ రెడీ చేస్తుంది. ఇంత‌లో ఆనంద రావు వ‌చ్చి.. పెళ్లి కూతురిలా త‌యారు చేస్తూ, మురిసి పోతున్నావా.. అని సౌంద‌ర్య‌తో అంటాడు. దీంతో హిమ‌కు కోపం వ‌చ్చి ఇదేం పోలిక తాత‌య్య అని అంటుంది. సౌంద‌ర్య మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకుని.. హిమ ద‌గ్గ‌ర పెళ్లి టాపిక్ తీసుకురావ‌ద్ద‌ని మీకు తెలుసుక‌దండి, నేను అందుకే హిమ‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ‌మ్మ ? అని అడ‌గ‌ను.. అని అంటుంది.

దీంతో హిమ‌కు కోపం వ‌చ్చి.. నాన‌మ్మ ఈ పెళ్లి టాపిక్ ఇక్క‌డితో ఆపుతావా.. అని గ‌ట్టిగా అంటుంది. శౌర్య క‌నిపించే వ‌ర‌కు నేను పెళ్లి చేసుకోను, శౌర్యను క‌లిసి క్ష‌మించ‌మ‌ని అడ‌గాలి, ఒక వేళ శౌర్య క‌నిపించ‌క పోతే జీవితాంతం నేను పెళ్లే చేసుకోను.. అని అంటుంది. ఆనంద రావు.. శౌర్య క‌నిపించే వ‌ర‌కు పెళ్లి చేసుకోవా.. అని అడ‌గ‌గా.. అవును తాత‌య్య, ఇది నాకు నేనుగా విధించుకున్న శిక్ష‌, మీ ఇద్ద‌రికీ మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నాను, పెళ్లి అని నా ప్రాణం తీయ‌కండి.. అని అంటుంది. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment