Karthika Deepam : డాక్ట‌ర్స్ అంద‌రి ఎదుట మోనిత.. త‌న బిడ్డ‌కు తండ్రి కార్తీక్ అని చెబుతుంది..!

December 1, 2021 11:11 AM

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో కార్తీక్ ను హాస్పిటల్ డాక్టర్స్ అందరూ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కార్తీక్, దీప, సౌందర్య, ఆనందరావు హాజ‌ర‌వుతారు. కార్తీక్ గురించి భారతి కాసేపు మాట్లాడి ఆ తర్వాత సౌందర్యను ఆహ్వానిస్తుంది. సౌందర్య వేదికపైకి వెళ్లి కార్తీక్ గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఆ వేడుకకు రాదనుకున్న మోనిత అప్పుడే ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది.

Karthika Deepam : డాక్ట‌ర్స్ అంద‌రి ఎదుట మోనిత.. త‌న బిడ్డ‌కు తండ్రి కార్తీక్ అని చెబుతుంది..!

కార్తీక్ గురించి నేను చెప్పగలను అని అనడంతో.. వెంటనే సౌందర్య మాట్లాడుతూ.. కార్తీక్ భార్య దీపకు కార్తీక్ గురించి చాలా తెలుసని, తను మాట్లాడుతుంద‌ని అనడంతో.. దీప వెళ్లడానికి సిద్ధమవుతుంది. అప్పుడే మోనిత ఆగకుండా వేదిక పైకి వెళుతుంది. భారతి వచ్చి అడ్డు చెప్పినా కూడా రివర్స్ తనకే కౌంటర్ వేస్తుంది. ఇక మోనిత తనను కార్తీక్ మోసం చేశాడ‌ని, గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి వదిలేసి వెళ్లాడ‌ని, ఆ సమయంలో చాలా బాధపడ్డాన‌ని అంటుంది.

మోనిత మాటలు విని అక్కడున్న వాళ్ళు తమలో తాము గుసగుసలాడుతుంటారు. అందుకే తాను కార్తీక్ ను వదులుకోలేక ఆర్టిఫిషియల్ గర్భం దాల్చానని చెబుతుంది. ఆ బిడ్డనే కార్తీక్ బిడ్డ అంటూ బిడ్డ వైపు చూపిస్తుంది. మోనిత తాను చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పాక తనకు న్యాయం చేయమని కోరడంతో దీప లేచి చప్పట్లు కొడుతూ వేదికపైకి వెళ్తుంది.

ఇక తరువాయి భాగంలో మోనిత తన బాబుతో మీ నాన్న ప్రెసిడెంట్ అయ్యాడని అంటుంది. వెంటనే కార్తీక్ కోపంతో రగిలిపోతూ మోనితను చంపేస్తాను అని తన దగ్గరికి వెళ్లడంతో.. సౌందర్య అడ్డుపడుతుంది. అయినా కూడా మోనిత తన మాటలతో వాళ్ళందర్నీ రెచ్చగొడుతుంది. మళ్లీ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. దీనిని బట్టి చూస్తే ఈ కథ ఇంకా కొన‌సాగుతున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి ఈ సీరియల్ కు ఇకపై శుభం కార్డు ప‌డ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment