RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాని బ్యాన్ చేయాల్సిందే.. చిత్ర యూనిట్‌కు అభిమానుల సెగ‌..

March 23, 2022 9:29 PM

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకి కన్నడ ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదుర‌వుతోంది.

Karnataka audience demand to ban RRR Movie
RRR Movie

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కన్నడ ప్రేక్షకులు #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మారుమ్రోగిపోయేలా ట్వీట్లు చేస్తున్నారు. ఇలా కన్న‌డ ప్రేక్షకులు ఈ సినిమాని బాయ్‌కాట్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను కన్నడనాట స్టార్ హీరోల సినిమాల‌కి ఏ మాత్రం తీసిపోకుండా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని కర్ణాటకలో కన్నడలోనే విడుదల చేయాలని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ రాజమౌళికి రిక్వెస్ట్ చేశారు.

అయితే శివ రాజ్ కుమార్ మాటకు ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా రాజమౌళి ఈ సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో ఎక్కువగా విడుదల చేస్తుండ‌డంతో.. కన్నడ ప్రేక్షకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ అడిగినా కూడా ఆయ‌న‌ మాటకు ఏమాత్రం విలువ లేదంటూ ఆరోపిస్తున్నారు. ఈ సినిమాని బాయ్‌కాట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక బాహుబలి విషయంలో కూడా కన్నడ ప్రేక్షకులు ఈ విధంగానే వ్యవహరించారు. దీంతో తెలుగు ప్రేక్షకులు త్వరలోనే కేజీఎఫ్ 2 విడుదల అవుతుందని.. ఆ విషయాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా గుర్తు పెట్టుకోవాలంటూ.. చెబుతున్నారు. మ‌రి కేజీఎఫ్ 2 విడుద‌ల అయిన‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now