Karate Kalyani : యూట్యూబ‌ర్‌తో గొడ‌వ‌.. గుడ్డ‌లూడ‌దీసి కొట్టిన కరాటే క‌ల్యాణి..!

May 13, 2022 8:24 AM

Karate Kalyani : క‌రాటే కల్యాణి ఈ మ‌ధ్య కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తోంది. మొన్నా మ‌ధ్య విశ్వ‌క్‌సేన్ గొడ‌వ‌పై ఈమె కామెంట్స్ చేసింది. స‌ద‌రు టీవీ చాన‌ల్, యాంక‌ర్‌ను క‌డిగిపారేసింది. విశ్వ‌క్‌సేన్‌కు ఈమె మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇక తాజాగా ఓ యూట్యూబ‌ర్‌తో గొడ‌వ ప‌డింది. ఈ క్ర‌మంలో ఈ గొడ‌వ కాస్త పెద్ద‌దిగానే అయింది. ఒక‌రిపై ఒక‌రు భౌతికంగా దాడి చేసుకున్నారు. మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. అయితే ఈ సంఘ‌ట‌న‌ను అంతా క‌ల్యాణి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. వివ‌రాల్లోకి వెళితే..

క‌రాటే క‌ల్యాణి హైద‌రాబాద్ లోని ఎస్సార్‌న‌గ‌ర్ ఏరియాలో ఉంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే అదే ప్రాంతంలో శ్రీ‌కాంత్ రెడ్డి అనే యూట్యూబ‌ర్ నివ‌సిస్తున్నాడు. అయితే అత‌ను మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచేలా అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడ‌ని చెప్పి.. క‌ల్యాణి అత‌న్ని అలా ఎందుకు చేస్తున్నావంటూ నిల‌దీసింది. దీంతో క‌ల్యాణి వెంట ఉన్న ఓ వ్య‌క్తి శ్రీ‌కాంత్‌పై చేయి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌కాంత్ క‌ల్యాణిని తోసేశాడు. ఆమె వెంట త‌న బిడ్డ కూడా ఉంది. దీంతో గొడ‌వ పెద్ద‌ది అయింది.

Karate Kalyani quarrel with youtuber
Karate Kalyani

త‌రువాత శ్రీ‌కాంత్‌ను క‌రాటే క‌ల్యాణి, ఆమె వెంట ఉన్న ఉన్న‌వారు ప‌ట్టుకుని ప‌రుగులు పెట్టిస్తూ ఉరికించి కొట్టారు. గుడ్డ‌లూడ‌దీసి చిత‌క‌బాదారు. త‌రువాత క‌ల్యాణి, శ్రీ‌కాంత్‌ల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నువ్వు అమ్మాయిలు, మ‌హిళ‌లతో ఎందుకు అలా ప్ర‌వ‌ర్తిస్తున్నావు.. అని ఆమె అడ‌గ్గా.. నువ్వు అలాంటిదానివే క‌దా.. నీకు రావ‌ల్సిన రూ.2 ల‌క్ష‌లు రాలేద‌ని నాతో గొడ‌వ ప‌డుతున్నావు.. అన్నాడు. అందుకు ఆమె ప్రూఫ్ ఉంటే చూపించాల‌ని ప్ర‌శ్నించింది. అలాగే 100 నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయండి.. మీరు మ‌నుషులు కాదా.. స్పందించ‌రా.. అంటూ చుట్టూ ఉన్న‌వారిపై విరుచుకుప‌డింది.

https://www.facebook.com/100003984783186/videos/1129942891122419/

అయితే ఈ సంఘ‌ట‌న గురువారం రాత్రి చోటు చేసుకోగా.. దీనిపై అస‌లు విష‌యం తెలియాల్సి ఉంది. మ‌రోవైపు క‌ల్యాణి ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియోల‌ను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అవి వైర‌ల్ అవుతున్నాయి.

https://www.facebook.com/100003984783186/videos/736308937390726/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now