Karate Kalyani : హమ్మ‌య్య అనుకుంటున్న క‌రాటే క‌ల్యాణి.. ఎట్ట‌కేల‌కు కేసు నుంచి బ‌య‌ట ప‌డిందిగా..!

May 18, 2022 10:15 PM

Karate Kalyani : న‌టి క‌రాటే క‌ల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఊహంచని మ‌లుపు తిరిగి అది ఆమె మీద‌కే రివ‌ర్స్ అయిన విష‌యం విదిత‌మే. ఆమె ఓ కుటుంబానికి చెందిన ప‌సిపాప‌ను ద‌త్త‌త తీసుకోకుండానే పెంచుకుంటుంద‌న్న విష‌యంలో ఆమెపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కేసు న‌మోదు చేశారు. అయితే ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల‌తోపాటు క‌ల్యాణి అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైంది. ఈ క్ర‌మంలోనే అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించిన అధికారులు క‌ల్యాణికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇక అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన క‌ల్యాణి పాపను ద‌త్త‌త ఇంకా తీసుకోలేద‌ని తెలియ‌జేయ‌గా.. వారు ఆ పాప‌ను ఆ త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించేశారు. పాప‌ను ద‌త్త‌త తీసుకోవాలంటే చ‌ట్ట ప్ర‌కారం అన్ని ప‌త్రాల‌తో ఆ ప‌ని చేయాల‌ని.. ఇలా ప‌త్రాలు లేకుండా ద‌త్త‌త తీసుకోవ‌ద్ద‌ని.. అధికారులు ఆమెకు సూచించారు. అయితే ఆ పాప త‌ల్లిదండ్రులు కూడా క‌ల్యాణి వెంటే ఉన్నారు. లేదంటే కేసులో ఆమె ఈ పాటికి జైలులో ఊచ‌లు లెక్క‌బెడుతుండేది.

Karate Kalyani got relief from her adaptation case
Karate Kalyani

ఇక అధికారుల విచార‌ణ అనంత‌రం పాప‌ను ఆమె త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించింది. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తాను పాప‌ను లీగ‌ల్‌గానే ద‌త్త‌త తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. త‌న‌పై కొంద‌రు కావాల‌నే బుర‌దజ‌ల్లే య‌త్నం చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. రాజ‌కీయ కోణంలోనే త‌న‌పై కొంద‌రు త‌ప్పుడు కేసులు పెట్టించార‌ని.. అయితే నిజా నిజాలు ఏమిటో నిగ్గు తేలుస్తాన‌ని.. త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన వారిని విడిచి పెట్ట‌బోన‌ని క‌ల్యాణి స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె హమ్మ‌య్య అని ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ముందు ముందు ఈ విష‌యంలో ఇంకా ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now