Karate Kalyani : న‌చ్చిన వ్య‌క్తి దొరికితే స‌హ‌జీవ‌నానికి రెడీ.. ఆ కోరిక ఇంకా నెర‌వేర‌లేదు.. క‌రాటే క‌ల్యాణి షాకింగ్ కామెంట్స్‌..

February 8, 2022 8:22 AM

Karate Kalyani : సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క‌రాటే కల్యాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినీ ఇండస్ట్రీలో ఈమె త‌న‌కంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది. ఎన్నో సినిమాల్లో బోల్డ్ పాత్ర‌ల్లో న‌టించి ఆశ్చ‌ర్య ప‌రిచింది. అలాగే బిగ్ బాస్ 4 లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. అయితే ప్రేమ‌, పెళ్లి వంటి విష‌యాల‌పై ఈమె తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది.

Karate Kalyani  comments about her love and marriage life
Karate Kalyani

తాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాన‌ని.. అయితే పిల్ల‌ల్ని క‌నాల‌నే కోరిక మాత్రం తీర‌లేద‌ని చెప్పింది. ఇక త‌న‌ను వాడుకుని వ‌దిలేశార‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయింది. ప్రేమ‌, పెళ్లి పేరుతో త‌నను వాడుకున్నార‌ని, ఇప్ప‌టికీ త‌న‌ను నిజంగా ప్రేమించే వారు దొర‌క‌లేద‌ని తెలిపింది. అందుకోస‌మే ఎదురు చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. నిజ‌మైన ప్రేమ ల‌భిస్తే అలాంటి వాడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పింది.

చాలా మందికి భార్య ఇంటికే పరిమితం కావాల‌ని, భ‌ర్త చెప్పిన‌ట్లు వినాల‌నే అభిప్రాయం ఉంటుంద‌ని.. కానీ తాను అలాంటి దాన్న‌ని కాన‌ని.. ఫైర్ లాంటిదాన్న‌ని.. అర‌చేతితో దాన్ని ఆప‌లేర‌ని చెప్పింది. నిప్పును అడ్డుకోలేర‌ని స్ప‌ష్టం చేసింది. అందుక‌నే వ‌దిలేశార‌ని తెలియ‌జేసింది.

తాను అన్ని విష‌యాల్లోనూ క‌రెక్ట్‌గానే ఉండేదాన్న‌ని.. అయితే త‌న ప్ర‌వ‌ర్త‌న వాళ్ల‌కు న‌చ్చ‌లేద‌ని, మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చేవ‌మ‌ని, వ‌రుస‌గా గొడ‌వలు అయ్యేవ‌ని.. అందుక‌నే విడాకులు తీసుకున్నాన‌ని, ఇప్పుడు త‌న‌కు న‌చ్చిన‌ట్లు జీవిస్తున్నాన‌ని చెప్పింది. అయితే త‌న‌కు ప్రేమ‌లు, పెళ్లిళ్లు క‌ల‌సి రావ‌ని పేర్కొంది.

న‌న్ను ప్రేమ‌, పెళ్లి పేరిట వాడుకున్నారు. ఇప్ప‌టికీ నిజ‌మైన ప్రేమ ల‌భ్యం కాలేదు. అందుకోసం ఎదురు చూస్తున్నా. అలాంటి ప్రేమ ల‌భిస్తే పెళ్లి చేసుకుంటా, న‌చ్చిన వ్య‌క్తి అయితే స‌హ‌జీవ‌నానికి కూడా రెడీ.. నాకు పిల్ల‌లు అంటే ఇష్టం. అందుకనే రెండు సార్లు పెళ్లి చేసుకున్నా.. అయితే ఆ కోరిక నెర‌వేర‌లేదు.. అని తెలిపింది.

నా మాజీ భ‌ర్త‌లు న‌న్ను త‌ర‌చూ తాగొచ్చి కొట్టేవారు, దాన్ని భ‌రించ‌లేక‌పోయా. పైగా నాపై అనుమానం ఉండేది. నేను త‌ప్పు చేయ‌కున్నా న‌న్ను తిడుతూ కొట్టేవారు. నేను చేయ‌ని త‌ప్పుకు ఎందుకు తిట్లు, దెబ్బ‌లు ప‌డాలి. అందుక‌నే విడాకులు తీసుకున్నా. అయితే జ‌నాల‌కు ఇవేమీ తెలియ‌దు. నేను ప‌డ్డ క‌ష్టాల‌ను ఏ మ‌హిళ ఎదుర్కోకూడ‌దు.. అని చెప్పింది.

ఒక ద‌శ‌లో నా స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోదామ‌నుకున్నా, ఒక‌సారి 10 నిద్ర‌మాత్ర‌లు మింగా. అయితే బ‌తికి బ‌య‌ట ప‌డ్డా. ఆ దేవుడు న‌న్ను కాపాడాడు, అంటే ఇంకా నేను చేసేది ఏదో ఉంద‌నే అర్థం. అందుక‌నే ధైర్యంగా నిల‌బ‌డ్డా. ప‌ది మందికీ స‌హాయం చేస్తూ ఇలా ఒంట‌రిగా జీవిస్తున్నా.. అంటూ క‌రాటే క‌ళ్యాణి తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now