Kangana Ranaut : తెలుగు హీరోల‌ను ఆకాశానికెత్తేసిన కంగ‌నా ర‌నౌత్‌.. ఏమ‌న్న‌దంటే..?

January 24, 2022 6:38 PM

Kangana Ranaut : ఇటీవ‌లి కాలంలో అనేక తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న విషయం విదిత‌మే. ఈ మ‌ధ్యే అలా విడుద‌లైన పుష్ప మూవీ ఆలిండియా లెవ‌ల్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే తెలుగు సినిమాలు అలా బాలీవుడ్‌లోనూ మంచి స‌క్సెస్‌ను సాధిస్తుండ‌డంపై బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ స్పందించింది.

Kangana Ranaut praised telugu and south stars

ద‌క్షిణాదిలో తెలుగు సినిమాల‌కు ప్ర‌త్యేక ఆద‌ర‌ణ ఉంటుంద‌ని కంగ‌నా పేర్కొంది. ఇక్క‌డి స్టార్లు భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను పాటిస్తార‌ని, ద‌క్షిణాది చిత్ర సీమ మొత్తం ఇలాగే ఉంటుంద‌ని కంగ‌నా పేర్కొంది.

తెలుగు హీరోలు త‌మ కుటుంబాల‌కు, అనుబంధాల‌కు పెద్ద పీట వేస్తార‌ని కంగ‌నా కితాబిచ్చింది. ఇక్క‌డి స్టార్స్ అంద‌రూ ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటార‌ని పేర్కొంది. క‌నుక ఇక్క‌డి స్టార్స్ బాలీవుడ్ వ‌ల్ల చెడిపోకూడ‌ద‌ని తాను భావిస్తున్నాన‌ని.. కంగనా చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now