Kamal Haasan : ఈ స్టార్ హీరో ఏంది.. ఆ వ్యాపారం చేయ‌డ‌మేంది ?

October 21, 2021 11:04 PM

Kamal Haasan : త‌మిళ స్టార్ హీరోల‌లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ పేరు త‌ప్ప‌క ఉంటుంది. ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదం అందించిన క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు బుల్లితెర‌పై హోస్ట్‌గా కూడా అద‌ర‌గొడుతున్నారు. తమిళ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే మ‌రో వైపు రాజ‌కీయాల‌లోను స‌త్తా చాటుతున్నారు. అయితే స‌క‌ల‌క‌ళావ‌ల్ల‌భుడిగా పేరు తెచ్చుకున్న క‌మల్ హాస‌న్ ఇప్పుడు ఫ్యాషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు.

Kamal Haasan to do cloth business in america

తన ఫ్యాషన్ లేబుల్ `హౌస్ ఆఫ్ ఖద్దర్` ను నవంబర్ లో ప్రారంభించనున్నారు క‌మ‌ల్‌. అమెరికా- చికాగోలో హౌస్ ఆఫ్ ఖద్దర్ మొదటి స్టోర్ ను ప్రారంభించడం ద్వారా భారతీయ చేనేత ప్రాశస్త్యాన్ని విదేశాలకు విస్తరిస్తున్నారు. చేనేత దుస్తులు సహా ఉపకరణాలకు గ్లోబల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని కమల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ ఈ దుస్తులను రూపొందించారు.

ఖాదీ మ‌న చ‌రిత్రతో ద‌గ్గ‌రి సంబంధం క‌లిగి ఉంది. ఈ ఉత్పత్తిని వ్యాపారం చేయగలుగుతున్నందుకు గర్వపడుతున్నాము. చక్కని సౌకర్యం దృక్కోణంలో ఖాది అనేది అన్ని వాతావరణాలకు అనుకూలమైన వస్త్రాలు. ఇది వేసవిలో ఎంతో చల్లదనాన్నిచ్చి చెమటను పీల్చే వస్త్రం. అందమైన కళను సృష్టించే చేనేత కార్మికులు, కళాకారులను బాగు చేసే ప్రయత్నం చేస్తాం“ అని కమల్ ప్రకటించారు. అయితే క‌మ‌ల్ లాంటి పెద్ద స్టార్ బ‌ట్ట‌ల వ్యాపారం చేయ‌డ‌మేంట‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ అనే సినిమాతో బిజీగా ఉన్న క‌మ‌ల్ త్వ‌ర‌లో ఈ సినిమాను మ‌న ముందుకు తీసుకురానున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now