Kamal Haasan : క‌రోనాని జ‌యించిన క‌మ‌ల్ హాస‌న్.. ఇక సినిమా షూటింగ్‌ల‌తో బిజీ..!

December 1, 2021 4:32 PM

Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. ఈ వార్తతో తమిళ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన వారు ఉలిక్కిప‌డ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. అయితే తాజాగా గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Kamal Haasan : క‌రోనాని జ‌యించిన క‌మ‌ల్ హాస‌న్.. ఇక సినిమా షూటింగ్‌ల‌తో బిజీ..!

తాజాగా విడుదలైన కమల్ హెల్త్ బులెటిన్‏లో ఆయన పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 3న ఆయ‌న‌ను డిశార్జ్ చేయనున్నామని.. డిసెంబర్ 4 నుంచి కమల్ తన పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల‌ క‌మ‌ల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోని రమ్య‌కృష్ణ హోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు క‌రోనా నుండి ఆయ‌న పూర్తిగా కోలుకోవ‌డంతో ఈ షోలో తిరిగి పాల్గొన‌నున్నారు.

మ‌రోవైపు క‌మ‌ల్ విక్ర‌మ్ అనే చిత్రం చేస్తున్నారు. న‌గ‌రం, ఖైదీ, మాస్ట‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ డైరెక్ట‌ర్‌గా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు సీనియ‌ర్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌తో మూవీ చేస్తున్నాడు. రాజ్ కమల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.మ‌హేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్‌హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్‌ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న 232వ చిత్ర‌మిది. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ఇటీవల అమెరికా వెళ్లిన కమల్ తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నవంబర్ 22న కమల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పటినుండి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సినీ వర్గాల్లో, అలాగే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో డిసెంబర్ 1న కమల్‌కు చికిత్సనందిస్తున్న శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వారు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now