Kamal Haasan : బిగ్ బ్రేకింగ్.. క‌రోనాతో ఆసుప‌త్రిలో చేరిన క‌మ‌ల్, ఆందోళ‌న‌లో ఫ్యాన్స్..

November 22, 2021 5:30 PM

Kamal Haasan : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌కంప‌నలు పుట్టిస్తూనే ఉంది. ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఏదో ఒక సంద‌ర్భంలో ఈ వైర‌స్ సామాన్యుల‌తోపాటు సెల‌బ్రిటీల‌ని సైతం ముప్పుతిప్ప‌లు పెడుతోం. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ వార్త కమల్ అభిమానులని కలవరపెడుతోంది. క‌మ‌ల్ కొన్ని రోజుల క్రితం సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభోత్సవానికి యూఎస్ వెళ్లారు. అక్క‌డ నుండి వ‌చ్చాక అనారోగ్యం బారిన ప‌డ్డారు క‌మ‌ల్.

Kamal Haasan admitted in hospital because of corona

‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దాంతో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూఎస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో క‌మ‌ల్‌కి చికిత్స కొనసాగుతోంది. కమల్ కి కరోనా సోకడంతో కొంత కాలం ఆయన ఐసోలేషన్ లో ఉండాలి. ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 5 కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ తమిళ్ 5 కి ఎవరు టెంపరరీ హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవ‌ల ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now