Kalyan Ram : నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన బింబిసార మూవీ ఆగస్టు 5న రిలీజ్‌కు సిద్ధమవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే సినిమాకు చెందిన ట్రైలర్‌ను ఇప్పటికే లాంచ్ చేశారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఎన్టీఆర్‌తో కలిసి మేకర్స్ చిత్రానికి ప్రమోషన్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఓ షోను కూడా ప్లాన్ చేస్తున్నారు.
కాగా బింబిసార మూవీకి గాను కల్యాణ్ రామ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నారు. అంతకు ముందు పొట్టతో 88 కేజీల బరువున్న ఆయన బింబిసార మూవీ కోసం ఏకంగా 13 కిలోలు తగ్గారు. దీంతో ఆయన ప్రస్తుతం 75 కిలోల బరువుకు చేరడమే కాదు.. శరీరాకృతిని అద్బుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఆరు పలకల దేహాన్ని రాబట్టారు. ఇక ఈ మూవీని 140 రోజుల్లో అద్భుతంగా తెరకెక్కించామని ఇప్పటికే కల్యాణ్ రామ్ తెలిపారు.
అయితే బింబిసార మూవీలో చాలా వరకు గ్రాఫిక్స్ ఉంటాయని అర్థమవుతోంది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ కాగా.. ఆయన తన ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తండ్రి హరికృష్ణ పేరిట సొంతంగానే ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఎన్‌టీఆర్ కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు త్వరలోనే ఇంటర్వ్యూల్లో సైతం పాల్గొననున్నారు. ఇక బింబిసార మూవీ ఎలా ఉంటుందోనని ప్రేక్షక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీకి గాను జూలై 29వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనుండగా.. దానికి ఎన్‌టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఈ మూవీని టైమ్ ట్రావెల్, యాక్షన్, అడ్వెంచర్, సై-ఫై జోనర్‌లలో తెరకెక్కించారు. అందుకనే దీనిపై అంతటి ఆసక్తి ఏర్పడింది. ఇక ఇందులో కల్యాణ్ రామ్‌కు జోడీగా క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్‌లో నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను కీరవాణి అందిస్తుండగా.. పాటలకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే బింబిసార మూవీపై ప్రేక్షకుల్లో రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శనను ఇస్తుందో చూడాలి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…