Kajal Aggarwal : చంద‌మామకు ఇక క‌ష్ట‌మే ? సినిమాల్లోకి మ‌ళ్లీ వ‌చ్చేనా ?

June 8, 2022 4:18 PM

Kajal Aggarwal : తేజ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన మూవీ.. ల‌క్ష్మీ క‌ల్యాణం. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఇది ఆమెకు మొద‌టి సినిమా. త‌రువాత కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన చంద‌మామ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. అనంత‌రం ఈమె న‌టించిన సినిమాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. ముఖ్యంగా రాజ‌మౌళి, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమాలో కాజ‌ల్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమా హిట్ కావ‌డంతో ఇక ఆమె వెనుక‌కు తిరిగి చూడ‌లేదు. అనేక హిట్ చిత్రాల్లో న‌టించి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇక తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అంద‌రితోనూ ఈమె న‌టించింది. ఈ క్ర‌మంలోనే అటు త‌మిళంలోనూ అద‌ర‌గొట్టింది. అక్క‌డ కూడా ప‌లు హిట్ చిత్రాల్లో ఈమె న‌టించింది. ఇక బాలీవుడ్ లోనూ ప‌లు మూవీల్లో న‌టించింది. త‌రువాత త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లును వివాహం చేసుకుంది. వెంట‌నే గ‌ర్భం కూడా ధ‌రించింది. ఇటీవ‌లే ఓ బాబుకు కూడా జన్మ‌నిచ్చింది. అయితే ఈమె చివ‌రిసారిగా ఆచార్య మూవీలో న‌టించింది. కానీ ఇందులో ఈమె సీన్ల‌ను తొల‌గించారు. దీనిపై ద‌ర్శ‌కుడు కొర‌టాల వివ‌ర‌ణ ఇచ్చారు. ఆచార్య‌లో చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టించారు క‌నుక ఆ పాత్ర‌కు హీరోయిన్ ను పెడితే సెట్ కాద‌ని అనుకున్నామ‌ని.. ఇదే విష‌యాన్ని కాజ‌ల్‌కు చెప్పామ‌ని.. ఆమె కూడా ఓకే అంద‌ని.. కొర‌టాల వివ‌రించారు. కానీ అందుకు కార‌ణం వేరే ఉంద‌ని తెలిసింది.

Kajal Aggarwal trying very hard to come to Tollywood again
Kajal Aggarwal

ఆచార్య షూటింగ్ స‌మ‌యంలోనే పెళ్లి చేసుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ హ‌ఠాత్తుగా గ‌ర్భం దాల్చింది. గ‌ర్భంతో ఉన్న ఆమెను పెట్టి సినిమాను తీయ‌లేరు. పైగా కొన్ని సీన్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ట‌. క‌నుక ఆమెను త‌ప్పించాల్సి వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని బ‌య‌టకు చెప్ప‌లేకే కొరటాల ఆ విధంగా క‌వ‌ర్ చేశార‌ని.. ఇటీవ‌లే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం మాత్రం తెలియ‌దు. కానీ ఇదంతా జ‌రిగిపోయింది. దీని గురించి ఎవరూ మాట్లాడ‌డం లేదు. అయితే ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోందట‌. టాలీవుడ్ లో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న‌వాళ్ల‌ను మ‌ళ్లీ కాంటాక్ట్ అవుతోంద‌ట‌.

అయితే గ‌ర్భం, ప్ర‌స‌వం అనంత‌రం కాస్త బ‌రువు పెరిగి బొద్దుగా మారిన కాజ‌ల్ ప్ర‌స్తుతం బ‌రువును త‌గ్గించుకునే ప‌నిలో ప‌డింద‌ట‌. దీంతోపాటే సినిమా చాన్స్‌ల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. మ‌రి ఈ అమ్మ‌డికి ఎవ‌రైనా చాన్స్ ఇస్తారా.. అస‌లు ఈమె సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇత‌ర హీరోయిన్ల‌తో పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లుగుతుందా.. అన్న వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment