Kajal Aggarwal : ఆచార్య మూవీలో కాజ‌ల్ సీన్స్‌ను మ‌ళ్లీ క‌ల‌ప‌బోతున్నార‌ట‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే..!

July 15, 2022 10:10 AM

Kajal Aggarwal : మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ మూవీకి రూ.84 కోట్ల మేర న‌ష్టాలు రాగా చ‌ర‌ణ్ ఇప్ప‌టికే రూ.25 కోట్ల‌ను సెటిల్ చేశార‌ని సమాచారం. అలాగే చిరంజీవి కూడా తాను ఈ మూవీకి తీసుకున్న రెమ్యున‌రేష‌న్‌ను డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇస్తున్నార‌ట‌. ఇక మ‌రోవైపు ఈ మూవీ నిర్మాణంలోనూ వాటా క‌లిగి ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ న‌ష్టాల‌ను భ‌రించేందుకు హైద‌రాబాద్‌లోని ప్రైమ్ ఏరియాలో ఉన్న త‌న ప్లాట్‌ను అమ్మబోతున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో వార్త ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే..

ఆచార్య మూవీలో చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపించారు. అయితే అలాంటి వ్య‌క్తికి హీరోయిన్ ఎందుక‌న్న ఉద్దేశంతో కాజ‌ల్ అగ‌ర్వాల్ సీన్ల‌ను తొల‌గించామ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల చెప్పారు. అందులో భాగంగానే చిత్ర ట్రైల‌ర్‌లోనూ ఎక్క‌డా ఆమె క‌నిపించ‌లేదు. దీనిపై కొర‌టాల ఆ విధంగా వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే ఆచార్య మూవీ త్వ‌ర‌లోనే శాటిలైట్ టీవీలో ప్ర‌సారం అవుతుంద‌ని తెలుస్తుండ‌గా.. ఆ టీవీ చాన‌ల్ వారు ఓ మెలిక పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Kajal Aggarwal scenes being added in Acharya movie
Kajal Aggarwal

ఆచార్య శాటిలైట్ హ‌క్కుల‌ను విక్ర‌యించిన‌ప్పుడు అందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరు ఉంద‌ట‌. దీంతో కాజ‌ల్ అగ‌ర్వాల్ సీన్లు ఉన్న సినిమానే కావాల‌ని స‌ద‌రు చాన‌ల్ వారు ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. అగ్రిమెంట్ ప్ర‌కారం మేక‌ర్స్ కూడా అలాగే మూవీని ఆ టీవీ చాన‌ల్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాజ‌ల్ లేకుండానే ఆమె సీన్ల‌ను తొల‌గించి ఆచార్య మూవీని రిలీజ్ చేశారు. క‌నుక ఆ మూవీని ఇప్పుడు శాటిలైట్‌కు ఇస్తామ‌ని అంటున్నారు. కానీ అగ్రిమెంట్ ప్ర‌కారం అయితే ఆమె ఉన్న సీన్ల‌తో కూడిన మూవీనే మేక‌ర్స్ టీవీ చాన‌ల్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చేసుకున్న డీల్‌లో స‌గం మొత్త‌మే ఇస్తామ‌ని ఆ టీవీ చాన‌ల్ వారు మెలిక‌పెడుతున్నార‌ట‌.

ఇక ఇప్ప‌టికే తీవ్ర‌మైన న‌ష్టాల్లో ఉన్న ఆచార్య మేక‌ర్స్ శాటిలైట్ హ‌క్కుల ద్వారా వ‌చ్చే మొత్తాన్ని విడిచిపెట్టుకోవ‌డానికి ఇష్టం ప‌డ‌డం లేద‌ట‌. క‌నుక వారు కాజ‌ల్ ఉన్న సీన్ల‌తోనే మూవీని అందిస్తామ‌ని చెబుతున్నార‌ట‌. అందువ‌ల్ల కాజ‌ల్ అగ‌ర్వాల్ ఉన్న సీన్ల‌ను ఆచార్య‌లో మ‌ళ్లీ క‌ల‌ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వ‌ర‌లోనే ఒక అప్ డేట్ రానున్న‌ట్లు స‌మాచారం. సినిమాలో హీరోయిన్ లేక‌పోవ‌డం చాలా మైన‌స్ కాగా.. ఇప్పుడు ఆమె ఉన్న సీన్లను మ‌ళ్లీ క‌ల‌ప‌బోతుండ‌డంతో ఫ్యాన్స్ ఆనంద‌ప‌డిపోతున్నారు. మ‌రి టీవీలో వ‌చ్చే ఆచార్య మూవీలో అయినా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపిస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now