Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన బిడ్డను చూసుకుంటూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతోంది. తను తొలిసారి అభిమానులకు బేబీ బంప్ ను చూపించినప్పటి నుంచి ఎప్పటి కప్పుడు తన ఆరోగ్య విషయాలను తెలియజేస్తూనే ఉంది. అయితే బిడ్డ పుట్టాక చాలా భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది. నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీల్ పుట్టిన క్షణాల్లోనే తెల్లటి వస్త్రాన్ని ధరింపజేసి నా ఛాతిపై పడుకోబెట్టారు. ఒక్క క్షణం తల్లిగా పట్టలేని ఆనందాన్ని పొందాను. అలాగే లోతైన ప్రేమను పొందగలిగాను.. అని చెప్పుకొచ్చింది.
దశాబ్ధ కాలంగా కాజల్ అగర్వాల్ తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. అయితే ఆచార్య సమయంలో కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో సినిమా పోర్షన్‌ని పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆమె పాత్రని పూర్తిగా తొలగించారు. గతంలో రిలీజ్ అయిన లాహే.. లాహే.. సాంగ్ లోనూ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. టీజర్, ట్రైలర్లలో కాజల్ ఊసే లేదు. సినిమాలో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. అయితే త్వరలో కాజల్ తిరిగి సినిమాలు చేయనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
కాజల్ ఏడాది వరకు సినిమాలు చేయదని, కొడుకే ప్రాణంగా చిన్నారితో గడుపుతుందని టాక్. వచ్చే ఏడాది సినిమాల షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. అయితే ఈమెకు అప్పుడు అవకాశాలు వస్తాయా.. అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆమె ఇక సినిమాలు చేయకపోవచ్చని.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసినట్లేనని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక కాజల్ నటించిన పలు చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. అవి ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…