Ravi Teja : ర‌వితేజ‌తో సినిమాలు చేయ‌డం వ‌లన ఆ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా..?

January 30, 2023 6:09 PM

Ravi Teja : సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని కాంబినేష‌న్స్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. కొన్ని కాంబినేష‌న్స్ లో సినిమా వ‌స్తే మాత్రం అది ఫ్లాప్ అని డిసైడ్ అయిపోతూ ఉంటారు. అయితే ర‌వితేజ‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి అస్స‌లు క‌లిసి రాలేదు. తెలుగులో కాజల్ అగర్వాల్ కు పేరుంది. కాజల్ అగర్వాల్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరు కావడంతో పాటు పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు కాజల్ ను ఆమెను లక్కీ హీరోయిన్ గా భావిస్తారు. ప్రభాస్, తారక్, చరణ్ లతో కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బంప‌ర్ హిట్స్ కొట్టాయి. దీంతో ఈ హీరోలు కాజల్ ను లక్కీ హీరోయిన్ గా భావిస్తారు. కాని ర‌వితేజతో సినిమాలు చేసిన కాజ‌ల్ ఒకానొక సంద‌ర్భంలో సందిగ్ధంలో ప‌డింది.

రవితేజ, కాజల్ కాంబినేషన్ లో వీర, సారొచ్చారు సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ‌మైన అప‌జయాన్ని సొంతం చేసుకున్నాయి. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కి 2011 సంవత్సరంలో విడుదలైన వీర అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కగా, శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాలో రవితేజ చెల్లి పాత్రలో నటించారు. ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమా ఎందుకో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.. ఆ తర్వాత సారొచ్చారు సినిమాలో రవితేజ, కాజల్ కలిసి నటించారు. పరశురామ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా నిరాశ‌ప‌ర‌చింది.

kajal aggarwal career lost because of Ravi Teja
Ravi Teja

సారొచ్చారు సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. రవితేజ కాజల్ కాంబినేషన్ ఫ్లాప్ కాంబినేషన్ కాగా , కాజ‌ల్‌కి ర‌వితేజ‌తో సినిమిలు చేయ‌డం వ‌ల‌న కెరీర్‌కి కొంత న‌ష్టం జ‌రిగింది. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో హిట్స్ ప‌డ‌క‌పోవ‌డం వ‌ల‌న ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమాలు వస్తాయో రావో చూడాలి. రవితేజ తాప్సీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్ర‌స్తుతం రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య సినిమాల‌తో మంచి విజ‌యాల‌ను అందుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now