Kaikala Satyanarayana : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంట్లో జారి పడ్డారు. నొప్పులు ఎక్కువగా ఉండడంతో సికిందరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించి ఇంటికే పరిమితయ్యారు.
కైకాల సత్యనారాయణ చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ చిత్రాల్లో తెరమీద కనిపించారు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినిమాల్లో అడుగు పెట్టారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల సుమారుగా 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో, తండ్రి, తాత ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.
రాజకీయాలలోనూ తనదైన ముద్రవేసుకున్నారు కైకాల. 1998లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2011లో సత్యనారాయణకు ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు లభించింది. కొద్ది రోజుల క్రితం కైకాల బర్త్ డే సందర్భంగా చిరంజీవి దంపతులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కొద్ది సేపు కైకాలతో విలువైన సమయం గడిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…