Junior NTR : త‌న ఫామ్‌హౌస్‌కు త‌న సినిమా పేరునే పెట్టుకున్న ఎన్‌టీఆర్..! ఏదో తెలుసా..?

July 16, 2022 9:21 PM

Junior NTR : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్రామాల్లో ఫామ్ హౌస్‌లు నిర్మించుకుంటున్నారు. సంప‌న్నులు ఈ విధంగా చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లు నిర్మించుకుని వాటిల్లో తోట‌లు పెంచుతున్నారు. ఈ క్ర‌మంలో వారం మొత్తం ప‌నిచేసి అల‌సిపోయిన వారు వీకెండ్స్‌లో ఫామ్ హౌస్‌ల‌లో సేద‌తీరుతున్నారు. ఇక కొంద‌రు అయితే క‌రోనా టైమ్‌లో పూర్తిగా ఫామ్ హౌస్ లలోనే గ‌డిపారు. అయితే సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ఇలా ఫామ్ హౌస్‌ల‌ను నిర్మించుకుంటున్నారు. వాటిల్లో వీకెండ్స్‌లో పార్టీలు జ‌రుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ కూడా ఓ చోట ఫామ్ హౌస్‌ను నిర్మించారు.

హైద‌రాబాద్ కు స‌మీపంలోని శంక‌ర్‌ప‌ల్లి అనే ప్రాంతంలో గోపాల‌పురం అనే గ్రామంలో తార‌క్ ఫామ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. అది ఆరున్న‌ర ఎక‌రాల విస్తీర్ణంలో ఉండ‌గా.. ఆ ఫామ్ హౌస్‌ను ఆయన త‌న భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తికి పుట్టిన‌రోజు కానుక‌గా ఇచ్చార‌ట‌. ఇక అందులోనే ఆమె బ‌ర్త్ డే వేడుక‌ల‌ను కూడా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫామ్ హౌస్‌కు ఎన్‌టీఆర్ త‌న సినిమా పేరునే పెట్టారు. అప్ప‌ట్లో వ‌చ్చిన బృందావ‌నం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఇదే సినిమా పేరును త‌న ఫామ్ హౌస్‌కు పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఫామ్ హౌస్‌కు చెందిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Junior NTR named his farm house after his movie name
Junior NTR

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే తార‌క్ ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్‌గా క‌నిపించి అల‌రించాడు. త‌రువాత ఆంజనేయ స్వామి మాల‌ను ధ‌రించాడు. అనంత‌రం విదేశాల‌కు వెకేష‌న్ కు వెళ్లి వ‌చ్చాడు. ఇక ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఇది ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. అలాగే ఈ మూవీ అనంత‌రం కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇలా వ‌రుస మూవీల‌తో తార‌క్ బిజీగా మారనున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now