Jr NTR Watch : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమరం భీంగా ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. . డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో పై సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటు , తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం విజయం సాధించిన కారణంగా చిత్ర యూనిట్ అనేక సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. అయితే హీరోలు ఏం చేసినా కూడా క్రేజీగానే ఉంటుంది. వాళ్లేం చేసినా అభిమానులు అలా ఫాలో అవుతుంటారు. వాళ్ల క్యాస్ట్యూమ్స్.. వాళ్ల ట్రెండ్స్ అన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్టీఆర్ కి కార్లు, వాచ్‌లు, దుస్తులు అంటే చాలా ఇష్టం. వాటికోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ తారక్ పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఇటీవల జరిగిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రెస్‌మీట్‌లో అతడు ధరించిన వాచ్‌పై అందరి దృష్టి పడింది. అది చాలా స్పెషల్‌గా ఉండడంతో.. దీని ధర ఎంత ఉంటుందబ్బా.. అని సెర్చ్ చేస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో దాని విలువ కనిపించింది . ఆ వాచ్ ధర 5,14,800 డాలర్లు అని తెలిసింది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు. ఏంటి ధరించిన వాచ్ ఖరీదు అంత అని అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు ఏంటి ఈ వాచ్ ప్రత్యేకత అనే విషయానికి వెళ్తే..ఈ వాచ్ రిచర్డ్ మిల్లే ఆర్ఎమ్ కు చెందిన 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోస్జీన్ వాచ్ అది. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్‌లతో ఇది కూడా ఒకటి. ఎన్టీఆర్ ఎంతో ఇష్టంతో ఈ వాచ్ కొలుగోలు చేశాడట. ఇలాంటివి ఆయన దగ్గర మరో రెండు వాచ్ లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…