Meals : ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. వీలు కుదిరినప్పుడే తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని తమ చేజేతులా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఆహారం తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు. మనసునిండా తినాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి..? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఆరోగ్యం నిజానికి సరైన జీవన శైలిపై ముడిపడి ఉంటుంది. మరి సరైన జీవనశైలి అనేది ఆహారం, వ్యాయామం మరియు శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా నమలకుండా భోజనం చేసేవారు తినే ఆహారాన్ని వేగాన్ని విధానాన్ని కంట్రోల్లో ఉంచలేరు. ఒక్కోసారి తక్కువగా తింటే కొన్నిసార్లు పరిమితికి మించి తినేస్తూ ఉంటారు. ఇలా చేయటం అనేది జీవక్రియలు అస్తవ్యస్తం అవ్వడమే కాకుండా ఈ ప్రభావం హార్మోన్ల మీద కూడా చూపడం జరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ మీ బరువు మీద ప్రభావితం చూపుతాయి. అంతేకాకుండా వేగంగా ఆహారం తినే వాళ్లకి ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ రోగాల బారిన పడినట్టుగా కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడయ్యింది.
ఆహారాన్ని సరిగా నమలకుండా తినేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. కడుపునిండటానికి భోజనం అనుకునేవాళ్ళు కొందరైతే.. భోజనం కోసమే జీవితమా అనుకునేవారు మరికొందరు. మంచి ఆహారాన్ని కోరుకునేవారు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. అంటే భోజనాన్ని మింగటానికి ముందు కనీసం ఒక 15 సెకన్లు అయినా నమిలి మింగాలి. ఆహారం వేగంగా తినడం కన్నా రోజు వారి అలవాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఆహారపు అలవాట్లు ఆలోచనా విధానాలు అన్నీ ముఖ్యమైనవే. ఒక భోజనం చేసే సమయం కనీసం 20 నిమిషాలు తక్కువ కాకుండా చూసుకోండి.
ఇప్పుడు ఆహారం నెమ్మదిగా తినడానికి సహాయడే కొన్ని చిట్కాలు ఏమిటో చూద్దాం. మీరు తినే ఆహారం గురించి పూర్తిగా తెలుసుకోండి. కొద్దికొద్దిగా ఎక్కువ సేపు తినడానికి ప్రయత్నించండి ఇది నెమ్మదిగా నమిలి తినటంలో సహాయం చేస్తుంది. మీరు తినే గదిలో కొన్ని ఆంక్షలను పెట్టుకోండి. భోజనం చేసే సమయంలో ఫోన్లను టీవీలను గాడ్జెట్లను దూరంగా ఉంచండి. పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగిన తర్వాతే మరొక ముద్ద తీసుకునేలా టైమింగ్ మెయింటెయిన్ చేయండి. హైడ్రేటెడ్ గా ఉండడం మంచిదే. కానీ చాలామంది భోజనంతో పాటు ఎక్కువ నీటిని తాగుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆహారం సక్రమంగా నమిలి తినడం వల్ల లాలాజలం ద్వారా మనకి కావలసిన ఆమ్లాలు పొట్టలోకి వెళ్లి ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. ఏదైనా ఆహారం మింగలేని సమయంలో కొద్దిపాటి నీళ్ళు త్రాగడం మంచిదే కానీ ఆహారంతో పాటు ఎక్కువ నీరు తీసుకోవడం అంతా సరైన పద్ధతి కాదు. కాబట్టి ఎలాంటి ఆర్భాటము లేకుండా నెమ్మదిగా ఆహారం తినడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…