Jr NTR : నయనతార, విగ్నేశ్ శివన్ జోడీకి కవల పిల్లలు పుట్టారనే వార్త ఒక్కసారిగా వైరల్ అవుతోంది. విగ్నేశ్ శివన్ ఈ మేరకు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమకు ట్విన్స్ పుట్టారంటూ, పండంటి బిడ్డలు పుట్టారని విగ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అందులో నయన్, విగ్నేశ్‌లు తమ బిడ్డల పాదాలను ముద్దాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం ఇంకోలా రియాక్ట్ అవుతున్నారు. దానికి కారణం మనందరికీ తెలిసిందే. పెళ్లయిన 4 నెలలకే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
అది సరోగసి ప్రాసెస్ అని అందరికీ తెలిసినా.. పెళ్ళికి ముందే ఇలా ఎలా చేయగలరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. నయనతార టాలీవుడ్ యంగ్ హీరో తారక్ తో కలిసి అదుర్స్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. చారిగా తారక్ అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ సీన్ ఉంటుంది మీకు గుర్తొచ్చింది కదా.
ఈ సీన్‌లో నయనతార ఫ్రెండ్ తో బెట్ వేసి స్విమ్మింగ్ పూల్ లో కి దూకగా ఎన్టీఆర్ సూసైడ్ చేసుకోబోతుందని కష్టపడి తన ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. అయితే అది బెట్ అనే సంగతి తారక్ కి తెలియదు. ఈ క్రమంలోనే తారక్, నయనతార మధ్య వచ్చే సీన్‌లో.. మీకు కవల పిల్లలు పుడతారండి.. మీకు అక్కడ పుట్టు మచ్చ ఉంది అంటాడు. దీంతో వెంటనే నయనతార షాక్ అయిపోయాయి ఛీ ఛీ అంటూ సీన్ కట్ చేస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ చెప్పినట్టే నిజంగా నయనతారకు కవల పిల్లలు పుట్టారు. ఈ కో ఇన్సిడెన్స్ ఏంటో అద్భుతంగా ఉంది కదూ అంటూ కొందరు ఫ్యాన్స్ ఆ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్టులో నయన్ కూడా చేరినట్టు అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…