Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తారాజువ్వలా ఎదిగాడు. బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసినా నిన్ను చూడాలని అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపుతూ ముందుకు దూసుకువెళ్ళుతున్నాడు యంగ్ టైగర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాకు పారితోషికం మూడున్నర లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం డబ్బును తల్లి షాలిని చేతిలో పెట్టేశాడు.
ఎన్టీఆర్ కి పుస్తకాలు చదవటం కన్నా వినడమే ఎక్కువ ఇష్టం. యంగ్ టైగర్ లక్కీ నంబర్ 9. అందుకే ఎన్టీఆర్ కారు నంబర్ లో అన్ని 9 అంకెలే కనపడతాయి. ఎన్టీఆర్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. మంచి బ్యాట్స్‌మన్. కాస్త విరామం దొరికినా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. మొదటి నుంచి వంటలో తల్లికి సాయం చేయటంతో ఎన్టీఆర్ మంచి కుక్ అని చెప్పవచ్చు. బిర్యానీ వండటంలో దిట్ట. బిగ్ బాస్ తొలి సీజన్‌లో తారక్ ఇంటి సభ్యులకు స్వయంగా బిర్యానీ కూడా వండి పెట్టాడు. ఇక ఎన్టీఆర్ కి తల్లి చేసే రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం. నెలకు ఒక్కసారైనా తినాల్సిందే.
ఎన్టీఆర్ కి వాచ్ లను సేకరించే హాబీ ఉంది. ఎన్టీఆర్ దగ్గర ఉన్న వాచ్ లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్టీఆర్ కి బాగా నచ్చిన సినిమా దాన వీర శూర కర్ణ. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుందట. తాను నటించిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో సినిమా మనస్సుకు దగ్గరైన సినిమా. అభిమాన హీరో తాతయ్య నందమూరి తారక రామారావు. అభిమాన హీరోయిన్ శ్రీదేవి. ఎన్టీఆర్ కు..మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి ఎన్టీఆర్‌కి అంకితం ఇచ్చారు.
ఎన్టీఆర్ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్. ఎన్టీఆర్ కి మొదటి నుంచి తనతో పనిచేసిన దర్సకులకు గిఫ్ట్స్ ఇవ్వటం అలవాటు. మార్చి 26 ఎన్టీఆర్ మర్చిపోలేని రోజు. 2009 మార్చి 26న ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడా అదే రోజు. మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం కథ మొదటగా ఎన్టీఆర్ దగ్గ్గరకే వచ్చింది. కథ నచ్చక ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…