Maa Elections : నోటికి అదుపు లేకుండా మాట్లాడటం సరికాదు.. పోసానిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జీవిత..

October 5, 2021 11:15 PM

Maa Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నటి జీవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల గురించి జీవిత మాట్లాడుతూ.. బండ్ల గణేష్, నటుడు నరేష్ పై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళి.. పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈమె స్పందించారు. ఆమె కూడా పోసానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

jeevitha shocking comments on Posani krishna murali maa elections

పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ ని అన్న మాటలు ముమ్మాటికీ తప్పు. రాజకీయాల పరంగా పవన్‌ను పోసాని ఎన్ని మాటలన్నా ఆయన భార్యా బిడ్డలను ఈ గొడవలోకి తీసుకురావడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆడవారి విషయంలో మాట్లాడేటప్పుడు భయం, భక్తితో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ.. జీవిత.. పోసాని కృష్ణమురళిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నామంటే ఆయన నాకు చుట్టం కాదు, మరొకరు నాకు చుట్టం కాదు.. అయితే ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తప్పకుండా వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో తమ ప్యానెల్ గెలిస్తే మాత్రం ఇండస్ట్రీలో ఈ విధమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని.. ఈ సందర్భంగా జీవిత మీడియా సమావేశంలో వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now