Jeevitha : నా కూతుళ్ల గురించి త‌ప్పుడు వార్త‌లు ప్రచారం చేశారు.. ఎమోష‌న‌ల్ అయిన జీవిత‌..

April 23, 2022 5:22 PM

Jeevitha : గరుడ వేగ సినిమా కోసం రూ. 26 కోట్లు ఎగ్గొట్టారని, దీనికి సంబంధించిన కేసులో జీవితకి నాన్ బెయిల‌బుల్ వారెంట్ ఇచ్చార‌ని వ‌చ్చిన నేప‌థ్యంలో జీవిత స్పందించింది. ఈ కేసు ఏడాది నుంచి నగరి కోర్టులో నడుస్తోంది. ఇంతకు ముందు కూడా నాపై వారెంట్ జారీ అయ్యింది. తాజాగా సమన్లు వచ్చిన మాట వాస్తవమే కానీ నేను అరెస్ట్ కాలేదు. ఈ కేసులో నేను గెలిచాను. వాళ్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌లో ఎంత మాత్రం వాస్త‌వం లేదు, అవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. అని పేర్కొంది.

Jeevitha got emotional about fake news of her daughters
Jeevitha

మేము ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు. కోర్టు తీర్పు త‌ర్వాత అన్ని వివ‌రాలు చెబుతాం. మాపై ఆరోప‌ణ‌లు చేసిన వారు చాలా త‌ప్పులు చేశారు, మా దగ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయి.. అని జీవిత ప్రెస్‌మీట్‌లో భాగంగా వెల్ల‌డించింది. నేను దాక్కో లేదని, తిరుగుతూనే ఉన్నానని అన్నారు. కోటేశ్వర రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, తామంటే నచ్చని వారెవరో వెనక ఉండి ఇలాంటి పనులు చేస్తుంటారని జీవిత చెప్పారు. ఓవర్ యాంబిషన్ కారణంగా కోటేశ్వరరాజు ఇలా ప్రవర్తిస్తున్నాడ‌ని అనిపిస్తోందని, ఆయన ఎవరి దగ్గరో చేసిన అప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్లుందని జీవిత పేర్కొన్నారు.

కొంతకాలంగా మీడియా ఎక్కువగా తమను టార్గెట్ చేస్తోందని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగినా కూడా జీవిత రాజశేఖర్‌ల విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారని, పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడుతుంటారని వాపోయింది. మా కూతుళ్ల విష‌యంలోనూ అలాగే చూశారు. ఆ థంబ్ నెయిల్స్ చూసి ఎంతో మంది ఫోన్‌లు చేశారు.. వారు తిరుమలకు వెళ్తుంటే.. అలాంటి సమయంలోనే అలా రాశారు.. వాళ్ల పాటికి ఏదో వాళ్లకు వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.. అలా తప్పుడు థంబ్ నెయిల్స్ ఎందుకు పెడతారు అంటూ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ అయింది.

ఇక రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమాకు ద‌ర్వ‌క‌త్వం వ‌హించింది జీవిత‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుద‌ల చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన‌ జోసెఫ్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now