విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై మ‌న‌సు పారేసుకున్న జాన్వీక‌పూర్‌..!

August 19, 2022 2:18 PM

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్టేటస్ ని సొంతం చేసుకున్న వారిలో ఒకరిగా చెప్పవచ్చు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ తో సరిపెట్టుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి చిత్రంతో తన దశ మారిందని వేరే చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయ్యింది. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రౌడీ బాయ్.

ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు విజ‌య్. ఈయనకు బయటే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న లైగర్ చిత్రంతో దేశ వ్యాప్తంగా పరిచయం కాబోతున్నాడు రౌడీ బాయ్. ఇటీవల  విడుదల చేసిన విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం పోస్టర్ తో దేశ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ అభిమానుల లిస్టులో బాలీవుడ్ నటులు కూడా ఎంతోమంది ఉన్నారు.

janhvi kapoor told why she likes vijay devarakonda very much

మన అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ కూడా విజయ్ దేవరకొండతో క్రాష్ లో  పడిపోయింది. ప్రస్తుతం జాన్వీ న‌టించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. గుడ్ లక్ జెర్రీ చిత్ర ప్రమోషన్ కి జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనకు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని కోరికగా ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

బాలీవుడ్ తారలు సైతం ఆకర్షించిన విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో వేరే చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండతో కలిసి నటించడానికి బాలీవుడ్ తారలు సైతం ఎంతోమంది క్యూ కడుతున్నారు. ఈ లిస్టులో సారా అలీ ఖాన్ కూడా ఒకరని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now