Janhvi Kapoor : తెలుగు సినిమాలు అందుకే చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన జాన్వీ కపూర్‌..

October 28, 2021 11:10 PM

Janhvi Kapoor : తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీదేవి. యావత్ సినీ ప్రపంచానికి అతిలోక సుందరి. ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ధడక్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినంత ఈజీగా ఆమెకు స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. జాన్వీ కపూర్ నటించే సినిమాలు సక్సెస్ లిస్ట్ లోకి చేరకపోయినా.. ఆమె నటనకు మంచి గుర్తింపే వస్తోంది.

Janhvi Kapoor told why she is not doing telugu films

ఈమె కోసమే బాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్స్ కథల్ని సిద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయట. అలాగే కోలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వచ్చాయని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలకు కారణం కూడా చెప్పింది ఈ బ్యూటీ.

సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో ఇప్పటి వరకు జాన్వీకి నచ్చిన పాత్రలు రాలేదట. సినిమా అవకాశాలైతే వస్తున్నాయి గానీ.. అందుకు తగిన మంచి పాత్రలు మాత్రం రాలేదని అన్నది. అలాగే మంచి కథ దొరికితే టాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తానని చెప్పింది. తాను పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

లేటెస్ట్ గా కొంతమంది టాలీవుడ్ స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్స్ జాన్వీ కపూర్ కోసం ప్రయత్నిస్తున్నారట. జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఓ మంచి స్టోరీతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి తెలుగు, తమిళంలో ఈ బ్యూటీకి సెట్ అయ్యే పాత్రలు, కథలు ఎప్పటికి సిద్ధం అవుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now