Janhvi Kapoor : ఊటీలో తెగ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి ఆనందానికి హ‌ద్దులే లేవు..!

April 18, 2022 7:22 PM

Janhvi Kapoor : శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ నిత్యం త‌న అందాల ఆర‌బోత‌తో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎంత దగ్గరగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టాలో తాను చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్.. జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం.

Janhvi Kapoor spending vacation in Ooty
Janhvi Kapoor

జాన్వీ క‌పూర్ వెండితెరపై కాస్త పొదుపుగానే అందాలు ఆరబోస్తుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తనకు ఎలాంటి రూల్స్ లేవు. ఎలాంటి కండిషన్స్ లేవు. దీంతో రెచ్చిపోతోంది. తనకు నచ్చిన విధంగా పోజులిస్తూ నెటిజన్లకి ఫుల్‌ మీల్స్ ని పెడుతుంటుంది. ఎక్క‌డికి వెళ్లినా జాన్వీ క‌పూర్ త‌న అందాల‌తోనే కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటోంది. స‌మ్మ‌ర్‌లో ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ అమ్మ‌డు ఊటీ వెళ్లిన‌ట్టుంది. అక్క‌డ జాన్వీ క‌పూర్ ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తోంది. ఒక‌వైపు కాఫీ తోట‌లు, మ‌రో వైపు స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ షేర్ చేసిన వీడియోలు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్‌. బాలీవుడ్‌ జనాలకు మంచి కిక్‌ ని ఇచ్చే కథానాయికల్లో జాన్వీ ఒకరు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ ఈ అందాల భామ ఒక్క ఫోటో షేర్‌ చేసిందంటే చాలు మిలియన్స్ లో వ్యూస్‌ వచ్చిపడుతుంటాయి. తన అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేకుండా దూసుకుపోతున్న ఈ భామని నెటిజన్లు సైతం అదే స్థాయిలో ఎంకరేజ్‌ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment