Janhvi Kapoor : జాన్వీ కపూర్.. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ధడక్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ క్రష్‌గా మారిపోయింది. అక్కడ నటించింది రెండు నుంచి మూడు సినిమాలే అయినా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
అయితే జాన్వీని తెరపై చూడాలన్న తన కోరిక తీరకుండానే శ్రీదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. జాన్వీ తొలి చిత్రం ధడఖ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో 2014లో దుబాయ్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడ శ్రీదేవి మృతి చెందారు. శ్రీదేవి మరణించక ముందు జాన్వీ కపూర్‌ను టాలీవుడ్ కు పరిచయం చేయాలనుకుందట. తనను స్టార్ హీరోయిన్ చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందిరికీ తెలిసిందే.
అదే సినిమాను రాంచరణ్ – జాన్వీకపూర్‌ను పెట్టి రీమేక్ చేయాలని శ్రీదేవి, రాఘవేంద్రరావు అనుకున్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్‌ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట. అది వర్కౌట్ అయితే త్వరలోనే తెలుగు తెరపై జాన్వీని చూడొచ్చు. ఇక జాన్వీ విషయానికొస్తే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా జాన్వీ పెట్రోల్ బంకులో బిగుతైన దుస్తులు ధరించి బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ తన అందాలు చూపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…