---Advertisement---

Jagadeka Veerudu Athiloka Sundari : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చిరు, చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌లో జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి 2..?

August 18, 2022 12:36 PM
---Advertisement---

Jagadeka Veerudu Athiloka Sundari : 1990లో ఇంద్రలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు కూతురు ఇంద్రజ భూమికి దిగి వచ్చి ఒక మానవుని ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. అని ఒక కొత్త కథాంశంతో వచ్చిన చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన అతిలోక సుందరిగా శ్రీదేవి నటించింది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సి.అశ్వినీదత్ నిర్మాణ సారథ్యం వహించారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటి తరానికి కూడా ఎంతో నచ్చుతుంది. అంత అద్భుతంగా ఉంటాయి ఈ చిత్రంలోని పాటలు.

అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. నిర్మాణ సంస్థకు కాసుల వర్షం కురిపించింది. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తమ బ్లాక్ బస్టర్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ గా చిత్రం నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇటీవల సీతారామం సక్సెస్ మీట్ లో పాల్గొన్న అశ్వినీ దత్ రామ్ చరణ్ తో తప్ప మరెవరితోనైనా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం రూపొందించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఒక పాత్రలో చేర్చాల‌నుకుంటున్నాను అని వెల్లడించారు.

Jagadeka Veerudu Athiloka Sundari sequel may start soon
Jagadeka Veerudu Athiloka Sundari

అశ్వినీ దత్ ఇదే విషయాన్ని చిరంజీవితో మాట్లాడారని, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నారట. ఈ విషయంపై చర్చలు జరపగా కథ మెగాస్టార్ కి నచ్చలేద‌ట‌. చరణ్ హీరోగా జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ కోసం తాజా కథ తీసుకురావడానికి మెగాస్టార్ బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల బట్టి రాఘవేంద్రరావు క‌చ్చితంగా ఈ చిత్రాన్ని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉత్తమమైన కథను బయటకు తీసుకురావడంతోపాటు, సమర్థవంతమైన ఫిలిం మేకర్స్ కూడా అవసరం. అశ్వినీదత్ కి సరైన దర్శకుడు దొరికితే మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యి ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై త్వ‌ర‌లో ఏమైనా వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారేమో చూడాలి.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now