Jabardasth : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఆమె వెలుగొందారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ.. ప్రత్యర్థులపై ఆమె విరుచుకుపడిన తీరు ఒక రేంజ్ లో ఉంటుంది. మంత్రి పదవి దక్కించుకున్నందుకు ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. మినిస్టర్ అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నానని చెప్పారు. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని.. ఇకపై జబర్దస్త్ షోలో కూడా పాల్గొనని చెప్పారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.
అయితే జబర్దస్త్‌లో ఇకపై రోజా తాను కనిపించబోనని చెప్పేశారు. దీంతో ఆ స్థానంలో మహిళా జడ్జిగా ఎవరు వస్తారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఒక పేరు అయితే బయటకి వచ్చింది. ఎగిరే పావురమా సినిమాతోపాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ లైలా ఇకపై జబర్ధస్త్ జడ్జిగా వ్యవహరిస్తుందనే సంకేతం ఇచ్చింది మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్.
ఇటీవల విడుదలైన ప్రోమోలో రోజాతోపాటు నటి ఆమని, లైలాకు కంటెస్టెంట్స్ చేసే స్కిట్‌లను ఎలా రిసీవ్ చేసుకోవాలి.. ఎలా కామెంట్ చేయాలి.. ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలనే విషయాలపై రోజా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా గమ్మత్తేంటంటే ఈ ప్రోమోలో ఆమని నువ్వు జడ్జిగానే ఉన్నావుగా మళ్లీ ఎందుకు అని రోజా అంటే నేను బాగా చేస్తే లైలాను ఎందుకు పిలుస్తారని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఆమె పొజిషన్‌లో సొట్ట బుగ్గల హీరోయిన్ లైలా నెక్స్ట్ జడ్జి అని తేలిపోయింది.
లైలా కాదంటే ఆమని, ఇంద్రజ కూడా రోజా స్థానాన్ని ఆక్రమించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో రోజాకు కాస్త అనారోగ్యం చేయటం వల్ల ఆ స్థానాన్ని నటి ఇంద్రజ భర్తీ చేశారు. ఇక రోజా కోలుకున్న అనంతరం తిరిగి ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇంద్రజ ఈ కార్యక్రమంలో ఉన్నన్ని రోజులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రోజా తిరిగి ఈ కార్యక్రమానికి రావడంతో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రోజా తప్పుకుంటే ఆ స్థానాన్ని ఇంద్రజ కూడా ఆక్రమించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే నూటికి నూరు శాతం లైలానే ఈ షోకు జడ్జిగా వస్తుందని అంటున్నారు. ఇక మరి ఆ స్థానంలోకి ఎవరు వస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…