Jabardasth : సీక్రెట్‌గా నిశ్చితార్థం జ‌రుపుకున్న సుజాత‌, రాకేష్‌..!

May 4, 2022 2:12 PM

Jabardasth : జ‌బ‌ర్ధ‌స్త్ షో వేదిక‌గా రాకింగ్ రాకేష్‌, జ‌బ‌ర్ధ‌స్త్ సుజాత ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న సుజాత‌, రాకేష్ తాజాగా నిశ్చితార్ధం జ‌రుపుకున్నారు. అయితే ఇది కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌రిగింది. ప్ర‌తి శుక్ర‌వారం బుల్లితెర‌పై సంద‌డి చేసే కామెడీ ప్రోగ్రాం జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ కార్యక్ర‌మంలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించేలా మరొకరు స్కిట్స్ తో ముందుకు వస్తున్నారు.

Jabardasth Rakesh and Sujatha done engagement
Jabardasth

తాజాగా ప్రోమో విడుద‌ల కాగా.. ఇందులో ఇమ్మాన్యూల్ కేజీఎఫ్ 2 పేరడీతో వచ్చేశాడు. ఇందులో ఇమ్మాన్యూల్ రాకీ భాయ్ గా నటించగా.. అధీర పాత్రలో భాస్కర్ గెటప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బుల్లెట్ భాస్కర్ గెటప్ చూసి.. నువ్వెవరో నాకు తెలుసు.. రాకేష్ మాస్టర్ కదా.. అంటూ ఇమ్మాన్యూల్ నవ్వులు పూయించాడు. ఇక సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ విభిన్నమైన స్కిట్ తో రెడీ అయ్యారు. ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్ కామెడీగా ఉంది.

ఇక ఈ ప్రోమోలో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. జబర్దస్త్ లవ్ జోడీగా ఉన్న రాకింగ్ రాకేష్, సుజాత షోలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా వెలిగిపోతున్నారు. రాకేష్ సుజాతకి రింగ్ తొడుగుతూ కనిపించాడు. నిశ్చితార్థం తరహాలో రింగు తొడిగిన రాకేష్.. సుజాతతో నీ పెళ్లి అయిపోయిందిగా.. అని చెప్పడం కాస్త గందరగోళంగా ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే 6వ తేదీ పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

ఇదిలా ఉండ‌గా సుజాత తన ఆత్మీయుడు, స్నేహితుడు, అంతకు మించిన అయిన రాకేష్‌కి తాను ఫోన్ కొనిస్తున్నట్టు చెప్పింది. అయితే ఆయనకు తెలియకుండా సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు ముందుగా చెప్పింది. హైదరాబాద్‌లోని అమీర్‌ పేటలో ఉన్న ఓ షోరూమ్‌కి తీసుకెళ్లింది. అయితే తానే ఫోన్‌ కొంటున్నట్టు కలరింగ్‌ ఇచ్చింది సుజాత. రాకేష్‌ కూడా అలాగే ఫీలయ్యాడు. ఆ ఫోన్‌ ఫీచర్స్ అన్నీ వెల్లడించారు. అంతా అయిపోయాక సడెన్‌గా ఈ ఫోన్‌ నీకే.. అంటూ రాకేష్‌ కి ఇచ్చింది సుజాత. దీంతో అంద‌రూ షాక‌య్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now