Jabardasth Naresh : జబర్దస్త్ నరేష్ నవ్వుల వెనుక ఇంతటి విషాదం ఉందా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నరేష్ రియల్ లవ్ స్టొరీ..

September 10, 2022 5:02 PM

Jabardasth Naresh : జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. అయితే జబర్దస్త్ కమెడియన్స్ లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఇతర షోలలో అప్పుడప్పుడు వారి రియల్ లైఫ్ ప్రతిబింబించేలా కన్నీళ్లు తెప్పించే స్కిట్స్ చేస్తుంటారు. జబర్దస్త్ నరేష్ గురించి పరిచయం అవసరం లేదు. తన హైట్ తనకు ఎంతో మేలు చేసిందని చెబుతుంటాడు. తన లోపాన్ని తానే అధిగమించుకుని ఈ స్థాయికి వచ్చానని అంటాడు.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. నరేష్ పెర్ఫామ్ చేసిన స్కిట్ విషయానికి వస్తే.. నరేష్ ఓ ఈవెంట్ లో డాన్స్ చేస్తుండగా అతడి డ్యాన్స్ కి ఒక అందమైన అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. దీనితో ఇద్దరూ ప్రేమలో పడతారు. నరేష్ ఆ అమ్మాయితో రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తాడు. ఒక రోజు ఆ అమ్మాయి తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడడం నరేష్ గమనిస్తాడు. ఇంకా ఆ పొట్టోడితోనే తిరుగుతున్నావా అని ఆమె బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు. అలా కాదు అభి ఆ పొట్టోడు ఈవెంట్స్ లో సంపాదించినా డబ్బు మొత్తం వాడుకుని వదిలేద్దాం అని చెబుతుంది. తనని ప్రేమ పేరుతో మోసం చేయడమే కాక తన లోపాన్ని హేళన చేయడంతో నరేష్ గుండె పగిలిపోతుంది.

Jabardasth Naresh real life story everybody got emotional
Jabardasth Naresh

గుండె పగిలేలా ఏడుస్తాడు. పిచ్చోడిగా మారిపోతాడు. నరేష్ పెర్ఫామెన్స్ కి గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ సదా కూడా ఎమోషనల్ అవుతుంది. స్కిట్ పూర్తయ్యాక మీరు చాలా సహజంగా నటించారు అంటూ నరేష్ ని సదా ప్రశంసిస్తుంది. మీ లైఫ్ లో ఇలాంటిది నిజంగా జరిగిందా అని అడుగుతుంది. దీనికి నరేష్ అవును మేడం అని బదులిస్తాడు. సో నరేష్ తన రియల్ లైఫ్ స్టోరీనే స్కిట్ గా పెర్ఫామ్ చేసి చూపించాడు. అలా నరేష్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పి అందరినీ ఏడిపించేశాడు. నరేష్ విరహ వేదన.. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూ ఏడ్చేశారు. నరేష్ నవ్వుల వెనుక ఇంతటి విషాదం ఉందా.. అని అంతా అనుకుంటున్నారు. నరేష్ ని మోసం చేసిన అమ్మాయి మీద మండిపడుతున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now