Chalaki Chanti : 5 వారాలకు చలాకీ చంటి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా.. నువ్వు మాములోడివి కాదు సామీ..!

October 11, 2022 12:54 PM

Chalaki Chanti : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. అయితే గత సీజన్లలో బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో కొనసాగింది. ఈ సీజన్ మాత్రం పరమ బోరింగ్ గా తయారయ్యింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే ఈ సీజన్ పై ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇక టీఆర్పీ పెంచాలని ఫిక్స్ అవడంతో నాగార్జున కూడా హౌస్ మెట్స్ మధ్య గొడవలు పెడుతూ రెచ్చగొడుతున్నాడు. కానీ ఈసారి నాగార్జున ఏం చేసినా.. ఎంతగా ప్రయత్నించినా.. పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు.

ఈ క్రమంలోనే ఈవారం హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం నిజంగా బిగ్ బాస్ అభిమానులకు షాకింగ్ కి గురి చేసింది. హౌస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ చంటి. అంత ఎందుకు కచ్చితంగా చంటి టాప్ త్రీ లిస్టులో ఉంటాడని అంతా అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా చంటి 5వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం సంచలనంగా మారింది. దీనికి మెయిన్ రీజన్ ఆయన హౌస్ లో అందరితో కలిసి ఉండటమే అంటున్నారు జనాలు. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లనే హౌస్ లో ఉంచుతారు. అందరూ నా వాళ్ళు అందరు నా మనుషులు అనుకుంటూ ఉండేవాడు చంటి.

Jabardasth Chalaki Chanti remuneration for Bigg Boss
Chalaki Chanti

దీంతో చంటి ఇక హౌస్ లో పనికిరాడు అంటూ ఎలిమినేట్ చేసేసారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ చంటి. వారానికి 2 లక్షల అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఈ విధంగా చంటి 5 వారాలకు 10 లక్షల పారితోషకం పుచ్చుకున్నాడని తెలుస్తుంది. ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి ఇది ఒక కారణమే. ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ హౌస్ లో ఖాళీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు.. మనకి కంటెంట్ ఇవ్వట్లేదు అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలిమినేట్ చేసేసింది. మరి చూడాలి ఇకపై చంటి జబర్దస్త్ లో కనిపిస్తాడా లేదా అనేది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now