Jabardasth Avinash : అవినాష్ పెళ్లి కొడుకాయ‌నే.. మ‌రి కొద్ది గంట‌ల‌లో బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై..

October 18, 2021 6:27 PM

Jabardasth Avinash : జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న అవినాష్‌.. బిగ్ బాస్ షో ద్వారా మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్రమంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇత‌డు త‌న పాపులారిటీని మ‌రింత పెంచుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్న‌ప్పుడు సరదాగా అందర్నీ నవ్విస్తూనే తన పెళ్లి టాపిక్ ఎత్తేవాడు. హోస్ట్ నాగార్జున కూడా అవినాష్ పెళ్లిపై సెటైర్లు వేస్తూ అతడిని ఓ ఆట ఆడుకునేవారు.

Jabardasth Avinash to marry with hours celebrations will begin

బిగ్ బాస్ హౌజ్‌లో అరియానాతో చాలా స‌న్నిహితంగా ఉన్న అవినాష్ ఆమెను ప్రేమ పెళ్లి చేసుకుంటాడేమోన‌ని అందరూ అనుకున్నారు. ఆమెతో ఈవెంట్స్ చేయ‌డం, గోవా ట్రిప్‌కి వెళ్ల‌డం చూసి వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నార‌నే ప్ర‌చారం బాగా జ‌రిగింది. కానీ తనకు కాబోయే భార్య అనూజను అవినాష్‌ అందరికీ పరిచయం చేశాడు. నిశ్చితార్థంకి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశాడు. వీరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రిలోనూ అనుమానాలు నెల‌కొని ఉండ‌గా, తాజాగా క్లారిటీ వ‌చ్చింది.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌ ఇంట పెళ్లి గంటలు మోగాయి. మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అవినాష్‌ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. సోమవారం అవినాష్‌ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో 2 రోజుల్లో అవినాష్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

https://www.instagram.com/p/CVKl6WKBuCe/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now