Jabardasth Avinash : అవినాష్ పెళ్లిలో అలాంటి పనులు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లు.. సోహైల్ పరువు తీసిన దివి..!

October 21, 2021 2:41 PM

Jabardasth Avinash : జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు పెళ్లి పెళ్లి అంటూ ఎంతో కలవరించిన అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. అనూజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నాడు. ఇక అవినాష్ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు దివి, సోహైల్, అరియానా హాజరై సందడి చేశారు.

Jabardasth Avinash bigg boss contestants enjoyed in the marriage

ఈ క్రమంలోనే వీరందరూ అవినాష్ జంటతో ఫోటో దిగగా ఆ ఫోటోను దివి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ ఆ ఫోటోలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉండటంతో వారందరి గురించి కామెంట్లు చేస్తూ వారి పరువు తీసింది. ముందుగా ఈ ఫోటోని షేర్ చేస్తూ అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసింది. అదేవిధంగా సోహైల్ గురించి కామెంట్ చేస్తూ ముందు ఫోటో సరిగా వచ్చిందా లేదా అని చూసుకొని ఆ తర్వాత విషెస్ చెప్పాలని చూస్తున్నట్టు ఉంది అంటూ రాసుకొచ్చింది.

ఇక అరియనా తన డ్రెస్ సరిగా ఉందా లేదా అని చూసుకుంటుందని, తాను మాత్రం భోజనాలు ఎక్కడ పెడుతున్నారా.. అంటూ భోజనాల కోసం చూస్తున్నట్లు ఉందని వారి గురించి తనే కామెంట్ చేసింది. ఇక అవినాష్ అయితే తన పెళ్లికి గిఫ్ట్ తీసుకువచ్చారా లేదా అన్నట్టు చూస్తున్నాడని.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ ఫోటోపై కామెంట్ చేసింది. ఇలా అవినాష్ పెళ్ళిలో జబర్దస్త్ కమెడియన్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కలిసి ఎంతో సందడి చేశారు. ప్రస్తుతం అవినాష్ పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now