Jabardasth : ఆది ఇక్క‌డ.. ఏమైనా ఉందా ? అన‌సూయ‌పై ఆది దారుణ‌మైన పంచ్‌లు..

October 2, 2021 11:08 AM

Jabardasth : అన‌సూయ‌, ఆది జ‌బ‌ర్ద‌స్త్ స్టేజిపై ఉన్నారంటే చాలు.. హాస్యం బాగా పండిస్తారు. ముఖ్యంగా ఆది అన‌సూయ‌పై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు. వాటిల్లో పంచ్‌లు బాగా ఉంటాయి. వాటిల్లో డ‌బుల్ మీనింగ్‌లు కూడా వ‌స్తుంటాయి. ఇక తాజాగా ఆది ఇలాగే అన‌సూయ‌పై మ‌రోసారి రెచ్చిపోయి పంచ్‌ల వ‌ర్షం కురిపించాడు.

Jabardasth : ఆది ఇక్క‌డ.. ఏమైనా ఉందా ? అన‌సూయ‌పై ఆది దారుణ‌మైన పంచ్‌లు..

అక్టోబ‌ర్ 7వ తేదీన ప్ర‌సారం కానున్న జ‌బ‌ర్ద‌స్త్‌కు చెందిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. అందులో ఆది స్కిట్‌లో భాగంగా దోశ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తాడు. దానికి అన‌సూయ వ‌స్తుంది. వ‌చ్చీ రాగానే.. అన‌సూయ ఇక్క‌డ‌.. అని అంటుంది. అందుకు అత‌ను.. ఆది ఇక్క‌డ‌.. మ‌రి ఏమైనా ఉందా ? అంటూ.. డ‌బుల్ మీనింగ్‌లో పంచ్ వేశాడు.

ఇక దోశ సెంట‌ర్ కు వ‌చ్చిన శాంతిపై కూడా ఆది పంచ్ వేశాడు. శాంతి రాగానే ఇంకా బోనీ కాలేదు, ఎవ‌రైనా బోనీ చేయ‌గానే ప‌దో ప‌ర‌కో ఇస్తా, ఆగు.. అంటాడు. ఇక అన‌సూయ చేతిని ప‌ట్టుకుని ఆది దోశ‌లు ఎలా వేయాలో నేర్పిస్తాడు. దీంతో అన‌సూయ త‌న‌కు దోశ వేయ‌డం వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డిపోతుంది. అంతలో ఆది క‌ల్పించుకుని.. అప్పుడే కాదు, ఇంకో రెండు సార్లు తిప్పాలి.. అంటాడు. దీంతో అన‌సూయ‌కు పంచ్ ప‌డింది.

ఇక స్కిట్‌లో భాగంగా దొర‌బాబు ఉండి దోశ‌లో తెల్ల వెంట్రుక వ‌చ్చింద‌ని అంటాడు. అందుకు ఆది స్పందిస్తూ.. అన‌సూయ, చూసుకుని దోశ వేయాలి క‌ద‌రా.. అంటూ ఆమెకు ముస‌లిత‌నం వ‌చ్చింద‌ని ప‌రోక్షంగా పంచ్ వేస్తాడు. దీంతో అన‌సూయ అత‌న్ని కొట్టేందుకు ముందుకు వ‌స్తుంది. ఇలా ఆది స్కిట్ వ‌చ్చే వారం న‌వ్వుల పువ్వులు పూయించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now