Samantha : స‌మంత భ‌ర‌ణం అడిగినా.. ఇవ్వ‌డం కుద‌ర‌దు.. ఎందుకంటే ?

October 3, 2021 5:49 PM

Samantha : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు విడిపోయాక ఇప్పుడు వారి విడాకుల విష‌యం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చాలా మంది ర‌క‌ర‌కాలుగా స్సందిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ మ‌ద్ద‌తుదారులు అయితే పీడ విర‌గ‌డ అయింది.. అంటున్నారు. అయితే ఇప్పుడు స‌మంత‌కు రావ‌ల్సిన భ‌ర‌ణంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

Samantha : స‌మంత భ‌ర‌ణం అడిగినా.. ఇవ్వ‌డం కుద‌ర‌దు.. ఎందుకంటే ?

స‌మంత‌, నాగ‌చైత‌న్య పెళ్లికి ముందు ప్రీ మారిటల్ అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌. అంటే భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా విడిపోతే భ‌ర‌ణం లాంటిది అడ‌గ‌కుండా ముందే అగ్రిమెంట్ చేసుకోవ‌డం అన్న‌మాట‌. అయితే ఇప్పుడు ఎలాగూ విడాకులు అయిపోయాయి క‌నుక ముందే చేసుకున్న ప్రీ మారిట‌ల్ అగ్రిమెంట్ ప్ర‌కారం.. సమంత‌కు చైత‌న్య భ‌ర‌ణం ఇవ్వాల్సిన ప‌నిలేద‌న్న‌మాట‌.

ఇక చ‌ట్ట ప్ర‌కారంగా చూసినా స‌మంత‌కు భ‌ర‌ణం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. భ‌ర్త నుంచి విడిపోయిన మ‌హిళ‌కు ఎలాంటి ఆధారం లేక‌పోయినా, జీవించ‌డం క‌ష్టంగా ఉన్నా.. అలాంటి స్థితిలో భ‌ర‌ణం అడ‌గ‌వ‌చ్చు. కానీ స‌మంత అటు సినిమాల్లో, ఇటు యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. క‌నుక ఆమె చట్ట ప్ర‌కారంగా చూసినా భ‌ర‌ణం ఇవ్వాల్సిన ప‌నిలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now