Koratala Siva : ఆచార్య కోసం ఆస్తులు అమ్ముకుంటున్న కొరటాల శివ‌..? క్లారిటీ ఇచ్చేశారుగా..!

July 16, 2022 4:30 PM

Koratala Siva : కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న విష‌యం విదిత‌మే. ఈ మూవీకి గాను డిస్ట్రిబ్యూట‌ర్లు ఏకంగా రూ.84 కోట్ల‌ను న‌ష్ట‌పోయారు. అయితే న‌ష్టం మొత్తాన్ని భ‌రిస్తామ‌ని ఇదివ‌ర‌కే రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చెప్పారు. అయితే చిరంజీవి నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమెరికా టూర్‌లో ఉన్న కార‌ణంగా వారికి ఆ మొతాన్ని అంద‌జేయ‌డం సాధ్య‌ప‌డలేదు. కానీ చిరు ఇండియాకు వ‌చ్చాక ఆచార్య న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసే ప‌నిలో ప‌డ్డారు.

ఈ క్ర‌మంలోనే ఆచార్య మేక‌ర్స్‌తోపాటు చ‌ర‌ణ్, కొర‌టాల అంద‌రూ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అయిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు. ఇక చ‌ర‌ణ్ ఇప్ప‌టికే రూ.25 కోట్ల‌ను చెల్లించిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే కొర‌టాల శివ త‌న న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆస్తుల‌ను అమ్ముతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న త‌న ప్లాట్‌ను అమ్మేందుకు శివ య‌త్నిస్తున్నార‌ని, దాంతో ఆచార్య న‌ష్టాల‌ను తీర్చేస్తార‌ని టాక్ న‌డిచింది. అయితే ఈ వార్త‌ల‌పై కొరటాల శివ టీమ్ స్పందించింది.

is Koratala Siva really selling his properties for Acharya losses
Koratala Siva

కొర‌టాల శివ జూబ్లీహిల్స్‌లోని త‌న ప్రాప‌ర్టీని అమ్మేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న టీమ్ స్ప‌ష్టం చేసింది. ఇవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని, వాటిని న‌మ్మొద్ద‌ని కోరారు. డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామ‌ని శివ హామీ ఇచ్చిన మాట వాస్త‌వ‌మే కానీ.. ఆయ‌న త‌న ప్రాప‌ర్టీల‌ను అమ్మ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక శివ ప్ర‌స్తుతం ఎన్‌టీఆర్ 30వ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now