Revanth Reddy : ఏ రంగంలోనైనా సరే వ్యక్తులు లేదా సంస్థల మధ్య పోటీ ఉంటుంది. రాజకీయాల్లోనూ అంతే. ఇక్కడ వ్యక్తులు లేదా పార్టీల మధ్య పోటీ ఉంటుంది. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా.. పిట్ట పోరు, పిట్ట పోరు.. పిల్లి తీర్చింది.. అన్న చందంగా.. కొన్ని సందర్భాల్లో రెండు పార్టీలు లేదా వ్యక్తుల మధ్య ఉండే పోరులో ఇతర పార్టీలు, వాటికి చెందన నేతలు బలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ ఉదాహరణ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.
నిజానికి రేవంత్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన మొదటి ఎన్నిక ఇది. అది కూడా ఉప ఎన్నిక. అందువల్ల ఈ ఒక్క ఎన్నికలో ఓటమి పాలైనంత మాత్రాన రేవంత్ సమర్థతను శంకించాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో ఆదరణ ఉంది. కానీ అది గత కొద్ది ఏళ్లుగా ఇంకా తగ్గింది. అందుకు ఎవరు కారణం అన్న అంశాన్ని పక్కన పెడితే.. పార్టీకి రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం తేవాలంటే అది రాత్రికి రాత్రే జరగదు. అందుకు చాలా సమయమే పడుతుంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఈ విధంగా ఎన్నిక వస్తే అందులో పోటీ చేసేందుకు ఓకే. కానీ పార్టీని ఇంత తక్కువ సమయంలో బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. కనుకనే హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైంది.
ఇక అక్కడ నిజానికి బీజేపీ, తెరాస పోరు కాదు, ఈటల వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా మారింది. రాజకీయ విశ్లేషకులే ఈ విషయాన్నిఅంగీకరించారు. అది ఈటలకు పట్టున్న స్థానం కనుక అక్కడ ఎవరూ గెలవరు అనే విషయం మరోమారు స్పష్టమైంది. అయితే కాంగ్రెస్‌కు మరీ అంత తక్కువ ఓట్లు రావడం నిజంగా చర్చనీయాంశమే.
బల్మూరి వెంకట్ కాకుండా ఓ బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ నిలిపి ఉంటే.. పరువు పోకుండా ఇంకొన్ని ఎక్కువ ఓట్లు వచ్చి ఉండేవి. అందువల్ల సరైన అభ్యర్థిని నిలపకపోవడం కూడా కాంగ్రెస్ ఓటమికి ఇంకో కారణం అని చెప్పవచ్చు. అయితే ఇంత తక్కువ కాలం మాత్రమే ఇచ్చి సరిగ్గా పనిచేయలేదంటూ రేవంత్ రెడ్డిపై నిందలు వేయాల్సిన పనిలేదు. సాధారణ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఇచ్చి.. ఆ ఎన్నికల్లో విఫలమైతే.. అప్పుడు విమర్శించాలి. నిందలు వేయాలి. కానీ ఈ ఒక్క ఎన్నికను సాకుగా చూపించి రేవంత్‌పై నిందలు వేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ఉప ఎన్నిక నుంచైనా పాఠం నేర్చుకుని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సిద్దమవుతుందా ? లేదా విఫలమవుతుందా ? అన్నది చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…