Anshu : అన్షు మళ్లీ వస్తోందా ? ఎన్టీఆర్‌ సినిమాలో.. ఆ పాత్రలో..?

November 17, 2021 10:57 PM

Anshu : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నటించిన మన్మథుడు సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో నటించిన సోనాలి బింద్రే, అన్షు లు కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇదిలా ఉండగా ఇందులో నటించిన అన్షు.. ఎన్టీఆర్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

is Anshu coming back in ntr movie that character

మన్మథుడు సినిమా తర్వాత రాఘవేంద్ర సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్షు. ఆ తర్వాత పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించింది. ఇక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆమెకి ఒక పాప, బాబు కూడా ఉండగా.. తన కుటుంబంతో కలిసి లండన్ లో సెటిల్ అయింది.

అన్షుకు మన్మథుడు సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఎందుకో ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవ లేకపోయింది. కాగా త్వరలోనే ఈమె రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now