IPL 2022 : ల‌క్నోపై క‌ష్ట‌ప‌డుతూ నెగ్గిన బెంగ‌ళూరు..!

April 19, 2022 11:40 PM

IPL 2022 : ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2022 టోర్నీ 31వ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జియాంట్స్‌పై రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ల‌క్నో వెనుక‌బ‌డింది. చివ‌రి వ‌ర‌కు పోరాటం చేసినా వికెట్లు ప‌డిపోవ‌డం.. బంతులు ఎక్కువ‌గా ఆడ‌డంతో ల‌క్నో ల‌క్ష్యాన్ని ఛేదించలేక‌పోయింది. దీంతో ఆ జ‌ట్టుపై బెంగ‌ళూరు 18 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2022 Bangalore won by 18 runs against Lucknow
IPL 2022

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగ‌ళూరు బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో కెప్టెన్ డుప్లెసిస్ 96 ప‌రుగుల‌తో చెల‌రేగిపోయాడు. ఇక మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. ల‌క్నో బౌల‌ర్ల‌లో దుష్మంత చ‌మీర‌, జేస‌న్ హోల్డ‌ర్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్క‌గా.. క్రునాల్ పాండ్యా 1 వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ల‌క్నో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో క్రునాల్ పాండ్యా (42 ప‌రుగులు), కేఎల్ రాహుల్ (30 ప‌రుగులు)లు మాత్ర‌మే ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో జోష్ హేజ‌ల్‌వుడ్ 4 వికెట్లు తీయ‌గా.. హ‌ర్ష‌ల్ ప‌టేల్ 2 వికెట్లు తీశాడు. అలాగే మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌లు చెరొక వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now