IPL 2021 : ఉత్కంఠ పోరులో కోల్‌క‌తా విజ‌యం.. ఫైన‌ల్స్‌లో చెన్నైతో ఢీ..!

October 13, 2021 11:28 PM

IPL 2021 : షార్జా వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో కోల్‌క‌తా అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుస్తుందని భావించారు. కానీ చివ‌ర‌కు విజ‌యం కోల్‌క‌తాను వరించింది. ఢిల్లీ నిర్దేశించిన 136 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా క‌ష్ట‌ప‌డుతూ ఛేదించింది. దీంతో ఢిల్లీపై కోల్‌క‌తా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2021 kolkata won by 3 wickets against delhi in ipl 2021 qualifier 2 match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌క‌తా ముందుగా ఫీల్డింగ్ చేయ‌గా.. ఢిల్లీ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగుల‌ను మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ల‌లో శిఖ‌ర్ ధావ‌న్ (36 ప‌రుగులు), శ్రేయాస్ అయ్యర్ (30 ప‌రుగులు)లు మాత్ర‌మే రాణించారు. మిగిలిన ఎవ‌రూ ఆకట్టుకోలేదు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2 వికెట్లు తీయ‌గా, లాకీ ఫెర్గుస‌న్‌, శివ‌మ్ మావి చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌క‌తా 19.5 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. 136 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ల‌లో శుబ‌మ‌న్ గిల్ (46 ప‌రుగులు), వెంక‌టేష్ అయ్య‌ర్ (55)లు రాణించారు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక ఢిల్లీ బౌల‌ర్ల‌లో అన్‌రిక్ నోర్‌జె, ర‌విచంద్ర‌న్ అశ్విన్, క‌గిసో ర‌బాడాలు త‌లా 2 వికెట్లు తీయ‌గా, అవేష్ ఖాన్‌కు 1 వికెట్ ద‌క్కింది. ఇక ఈ మ్యాచ్ లో విజ‌యంతో కోల్‌క‌తా జ‌ట్టు ఈ నెల 15వ తేదీన ఫైన‌ల్స్‌లో చెన్నైతో త‌ల‌ప‌డ‌నుంది. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2021 ఫైన‌ల్ మ్యాచ్‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now