భూమి వైపుకు వేగంగా దూసుకు వ‌స్తున్న సౌర తుఫాను.. నేడు లేదా రేపు భూమిని ఢీకొట్టే అవ‌కాశం..

July 11, 2021 1:11 PM

భూమి వైపుకు అత్యంత వేగంగా సౌర తుఫాను దూసుకు వ‌స్తుంద‌ని అమెరికా అంత‌రిక్ష సంస్థ నాసా వెల్ల‌డించింది. ఆ సౌర తుఫాను గంట‌కు 1.6 మిలియ‌న్ కిలోమీట‌ర్ల వేగంతో భూమి వైపుకు వ‌స్తుంద‌ని, అయితే స‌మ‌యం గ‌డిచే కొద్దీ దాని వేగం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

solar storm coming towards earth with massive speed may hit earth soon

సూర్యుని నుంచి అత్యంత శ‌క్తివంత‌మైన క‌ణాలు లేదా ప్లాస్మా బ‌య‌ట‌కు వ‌చ్చి సౌర తుఫాన్లుగా మారుతాయి. సౌర గాలుల రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయి. కాగా ఆ సౌర తుఫాను భూమిని నేడు (జూలై 11) లేదా రేపు (జూలై 12) ఢీకొట్టే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు తెలిపారు. భూమిని ఉత్త‌ర లేదా ద‌క్షిణ అక్షాంశాల వ‌ద్ద ఈ సౌర తుఫాను ఢీకొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

ఇక ఈ సౌర తుఫాను భూమిని ఢీకొనే స‌మ‌యంలో భూమి చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్న శాటిలైట్ల‌పై ప్రభావం ప‌డుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. దీని వ‌ల్ల జీపీఎస్ నావిగేష‌న్, మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్, శాటిలైట్ టీవీ సిగ్న‌ల్స్ స‌రిగ్గా ప‌నిచేయ‌వ‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment