భార‌త్ నుంచి రాకండి.. ఆస్ట్రేలియా పౌరుల‌కు ఆ దేశ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌..

April 30, 2021 9:20 PM

భార‌త్‌లో ఉంటున్న ఆస్ట్రేలియా వాసుల‌కు ఆ దేశ ప్ర‌భుత్వం షాకిచ్చింది. భార‌త్‌లో గ‌త కొద్ది రోజులుగా భారీ ఎత్తున కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో 14 అంత‌క‌న్నా ఎక్కువ రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు త‌మ దేశానికి వెళ్ల‌కూడ‌దు. వెళితే 66000 డాల‌ర్ల ఫైన్ లేదా 5 ఏళ్ల జైలు శిక్ష‌ను విధిస్తారు. ఆస్ట్రేలియా దేశం తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది.

australia to fine its citizen coming from india

భార‌త్‌లో కోవిడ్ కేసులు భారీగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్ ఆడుతున్న కొంద‌రు ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఇప్ప‌టికే సొంత దేశానికి వెళ్లిపోయారు. అయితే అప్ప‌టికే ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. దీంతో వారు ఇత‌ర దేశాల‌కు వెళ్లి అక్క‌డి నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఇక మ‌రికొంద‌రు ప్లేయ‌ర్లు కూడా సొంత దేశానికి వెళ్లిపోతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

ఇక భార‌త్‌లో సుమారుగా 9000 మంది ఆస్ట్రేలియ‌న్లు ఉంటున్నార‌ని స‌మాచారం. వారిలో 600 మందికి కోవిడ్ ముప్పు ఉన్న‌ట్లు తెలిసింది. కాగా భార‌త్ కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి వేగంగా ఉన్న నేప‌థ్యంలో భార‌త్ నుంచి ఆస్ట్రేలియాకు త‌మ పౌరులు రాకూడద‌ని, ఎవ‌రైనా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆస్ట్రేలియా తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now