Indian Railways : రైలు ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. డిస్పోజ‌బుల్ దుప్ప‌ట్ల‌ను ఇవ్వ‌నున్న రైల్వేశాఖ‌..

January 21, 2022 7:44 PM

Indian Railways : రైళ్ల‌లో ప్ర‌యాణించేవారికి భార‌తీయ రైల్వే శుభ‌వార్త చెప్పింది. క‌రోనా కార‌ణంగా రైళ్ల‌లో ప్ర‌యాణికుల‌కు దుప్ప‌ట్ల‌ను, దిండ్ల‌ను ఇవ్వ‌డం లేద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల‌కు దుప్ప‌ట్ల‌ను, దిండ్ల‌ను ఇవ్వాలని నిర్ణ‌యించారు. అయితే వాటిని డిస్పోజ‌బుల్ ప‌ద్ధ‌తిలో ఇస్తారు.

Indian Railways to give disposable bedrolls to passengers

ఇక‌పై రైళ్ల‌లో ప్ర‌యాణికుల‌కు దుప్ప‌ట్ల‌ను, దిండ్ల‌ను అందించాల‌ని రైల్వే శాఖ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు ముంద‌స్తుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డిస్పోజ‌బుల్ దుప్ప‌ట్లు, దిండ్ల‌ను ఇస్తారు. మొత్తం ఒక కిట్ రూపంలో వాటిని అందిస్తారు.

రైల్వే శాఖ అందించే కిట్‌లో దుప్ప‌ట్లు, దిండుతోపాటు ప‌లు వ‌స్తువులు కూడా ఉంటాయి. ఒక తెలుగు రంగు బెడ్ షీట్‌, ఒక గ్రే క‌ల‌ర్ బ్లాంకెట్‌, ఒక దిండు, దిండు క‌వ‌ర్‌, నాప్ కిన్‌, మూడు లేయ‌ర్లు ఉండే మాస్క్‌, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి. ప్ర‌యాణికులు రూ.150 చెల్లించి ఈ కిట్‌ను పొంది అందులో ఉండే వ‌స్తువుల‌ను ఉపయోగించుకోవ‌చ్చు. ప్ర‌యాణం ముగిశాక వాటిని ప‌డేయాలి. అయితే ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం కొన్ని ఎంపిక చేసిన రైళ్ల‌లోనే ఉంది. కానీ త్వ‌ర‌లోనే మిగిలిన అన్ని రైళ్ల‌లోనూ ఈ స‌దుపాయాన్ని అందివ్వ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now