బీహార్‌లో ఇటీవలి కాలంలో కొందరి బ్యాంకు అకౌంట్లలో కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ అయిన విషయం విదితమే. అయితే ఆయా సంఘటనలపై ఇప్పటికీ విచారణ చేస్తున్నారు. డబ్బులు అంత పెద్ద మొత్తంలో పలువురి అకౌంట్లలో ఎందుకు దర్శనమిస్తున్నాయో ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. అయితే తాజాగా ఇంకో వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని సుపౌల్ టౌన్‌లో ఉన్న సిసౌనీ అనే ప్రాంతంలో విపిన్ చౌహాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల అతను స్థానికంగా ఉన్న ఓ కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే అతని ఆధార్ నంబర్ చెక్ చేసిన ఉద్యోగులు దానికి ఓ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ అకౌంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అయితే దాన్ని తాను ఓపెన్ చేయలేదని, అసలు తనకు బ్యాంకు అకౌంట్ లేదని అతను చెప్పాడు. దీంతో అధికారులు ఖంగు తిన్నారు.
ఇక ఆ అకౌంట్‌ను అక్టోబర్ 13, 2016లోనే ఓపెన్ చేయగా.. అందులో పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించారు. కోట్ల రూపాయల లావాదేవీలు అందులో జరిగాయి. కానీ ఆ అకౌంట్ ఎలా ఏర్పాటు అయింది ? అని వివరాలు వెతికారు. కానీ ఏమీ లభ్యం కాలేదు. ఇక అందులో పెద్ద మొత్తంలో లావాదేవీలు మాత్రం జరిగాయి. అలాగే ప్రస్తుతం ఆ అకౌంట్‌లో రూ.9.99 కోట్లు ఉన్నాయి. దీంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…