దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నప్పటికీ చాలా చోట్ల ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కొందరు మానవతా వాదులు తమ సొంత ఖర్చులతో ఆక్సిజన్ సిలిండర్లు కొని కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా సహాయం చేస్తున్న ఓ యువకుడిని అందరూ మెచ్చుకోవాల్సిందే పోయి ఏకంగా జైల్లో పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే… యూపీలోని జౌన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా ఎంతో మంది అవస్థలు పడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న విక్కీ అగ్రహారి అనే యువకుడు స్పందించి.. సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేసి బాధితులకు ఆక్సిజన్ అందిస్తున్నాడు. ఈ విషయంపై ఎంతోమంది విక్కీపై ప్రశంసలు కురిపించగా పోలీసులు మాత్రం అతన్ని జైల్లో పెట్టారు.
ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విక్కీ కరోనా పరీక్షలు చేయించుకోకుండా,శానిటైజ్ చేయకుండా ఆక్సిజన్ సిలిండర్లను బాధితులకు అందిస్తూ covid-19 నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి ఐపీసీ 188, 269 సెక్షన్లు, ఎపిడెమిక్ డిసీజెస్ చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…