గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించే కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో మహోబా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకం కింద ఉజ్వల 2.0 ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లతోపాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ ప్లేట్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో చేరడానికి సరైన ఆధారాలు అవసరమే. కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన వారికి ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా గ్యాస్ కనెక్షన్లను అందించనుంది.
ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే1, 2016న ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. ఎవరైతే దారిద్ర్యరేఖకు దిగువన ఉంటారో అలాంటి మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మొదటిదశలో భాగంగా 1,47,43,862 LPG కనెక్షన్లను తీసుకున్నారు. అయితే ఈ పథకానికి ఏవిధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు విషయానికి వస్తే.. కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. ఈ మహిళలు తప్పనిసరిగా దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఇంట్లో ఏ కుటుంబ సభ్యులకి కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…